Wifi Router కాన్ఫిగర్ చేయడం

ఇంటర్నెట్ షేరింగ్ కోసం ఉపయోగించే రౌటర్ ని ఎలా కాన్ఫిగర్ చేయాలో తెలుసుకుందాం.  ఇక్కడ మనం కాన్ఫిగర్ చేయడం కోసం Netgear N150 అనే సిరీస్ రౌటర్ తీసుకున్నాము. Configuration రెండు విధాలుగా చేసుకోవచ్చు ముందుగా మనం Manual(Advanced mode) గా ఎలా కాన్ఫిగర్ చేయలో తెలుసుకుందాం.  కావలిసిన Devices

  1. Netgear N150 Series Router.
  2. ISP (Internet Service Provider) Details.
  3. Desktop/Laptop కాన్ఫిగర్ చేయడం కోసం.
Netgear Router Default  IP మరియు login details ఉంటాయి.
       IP                : 192.168.1.1
       Username  :  admin            
       Password    : Password
ఈ డిటేల్స్ మొదటి Login కోసం ఉపయోగించి తరువాత మార్చుకోవచ్చు లేదంటే వాటినే కొనసాగించవచ్చు.
Step  1:

మొదటగా బ్రౌజరు ఓపెన్ చేసి (Any Browser ఇక్కడ Internet Explorer ఉపయోగిస్తున్నాము) దాని Address Bar లో 192.168.1.1 ఇవ్వండి.  

Step 2:

ఇప్పుడు Login Dialog Box ఓపెన్ అవుతుంది.

User name, password ఇచ్చిన తరువాత OK క్లిక్ చేయండి.

Step 3: Basic Settings


·         Does Your Internet Connection Require A Login?

మీ ఇంటర్నెట్ Login అవసరం అనుకుంటే Yes,  అవసరం లేదు అనుకుంటే No సెలెక్ట్ చేసుకోండి.
·         Internet IP Address
ఇక్కడ ముందు మీరు తెలుసుకోవలిసింది మీ ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్(ISP) IP Address Static  గా ఉంటే ఇక్కడ Use Static IP Address ని సెలెక్ట్ చేసుకోవాలి, అప్పుడు కిందన ఉన్న IP Address సెక్షన్ Enable అవుతుంది, లేకపోతె Disable అయి ఉంటాయి. ఇపుడు మీ దగ్గర ఉన్న డిటేల్స్ ప్రకారం ఇక్కడ ఫిల్ చేయండి.  IP Address, Subnet, Gateway ఇవ్వన్ని కూడా మీ ISP నుండి దగ్గర నుండి పొందవలసి వస్తుంది.  ఒకవేళ మీ ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్ (ISP ) DHCP ద్వారా కనెక్షన్ ఇచ్చినట్టు అయితే కనుక సరిపోతుంది IP Address దాని అంతట అదే Router On చేసినపుడు మీ ISP సర్వర్ నుండి ఆటోమాటిక్ గా పొందుతుంది.
·         Domain Name Server (DNS) Address
DNS కూడా ISP నుండి పొందవలిసి వస్తుంది.  పైన మాట్లాడు కున్న రూలే ఇక్కడ కూడా అన్వయిన్చబడుతుంది. 
·         Router MAC Address
MAC అడ్రస్ అంటే కంప్యూటర్ లోని నెట్ వర్క్ కార్డు యొక్క నెంబర్ ఇది ప్రతి నెట్ వర్క్ కార్డు (NIC Card) కి ప్రత్యేక మయిన అడ్రస్ కలిగి ఉంటుంది. ఏ రెండు నెట్ వర్క్ కార్డు (NIC Card) లు ఒకే అడ్రస్ లు కలిగి ఉండవు. 
ఇక ఇక్కడ మీరు చేయలిసింది ఏమి ఉండదు కాని కొన్ని సందర్భాలలో ఇంటర్నెట్ సర్వీసు ప్రోవాదర్ (ISP) MAC Address బెస్ చేసుకుని ఇంటర్నెట్ ఇవ్వడం జరుగుతుంది.  అంటే మొదట సారి మీ కంప్యూటర్ కి ఇంటర్నెట్ configure చేసేనపుడు ISP మీ MAC Address ని వారి యొక్క సర్వర్ లో  రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అప్పటినుండి ఇంటర్నెట్ బ్రౌస్ చేయాలి అని ప్రయత్నించి నపుడు మీ యొక్క MAC Address సరేపోతేనే ఇంటర్నెట్ Connect అవడం జరుగుతుంది ఒకవేళ మీరు ఏ కారణం చేతనైన మీ LAN Card మార్చినట్లేయితే మీ ISP  కి చెప్పి మీ  యొక్క నూతన MAC Address ని Update చేసుకోవలిసి వస్తుంది అప్పటి వరకు మీరు ఇంటర్నెట్ కి Connect కాలేరు. 
ఈలాంటి ప్రత్యేక మయిన సందర్భాలలో తప్పితే ఇక్కడ మీరు చేయలిసింది ఏమి ఉండదు Use Default Address అని సెలెక్ట్ చేసుకోండి సరిపోతుంది.
ఒకవేళ ISP MAC Address రిజిస్టర్ చేసినట్లేయితే మీరు రౌటర్ Configure చేసేటపుడు ఏ సిస్టం లో అయితే ISP మీ ఇంటర్నెట్ కనెక్షన్ ని కాన్ఫిగర్ చేసాడో అదే సిస్టం నుండి మీరు రౌటర్ కి Connect అయి రౌటర్ ని కాన్ఫిగర్ చేస్తునట్లు అయితే Use Computer MAC Address అనే Option సెలెక్ట్ చేసుకోండి.  అపుడు మీ కంప్యూటర్ యొక్క MAC Address మీ రౌటర్ యొక్క MAC Address గా Update చేయబడుతుంది.
ఇక చివరిది అయిన మూడవ Option  Use This MAC Address  మీరు రౌటర్ ని మీ ఇంటర్నెట్ Configure అయి ఉన్న కంప్యూటర్ నుండి కాకుండా మీ నెట్ వర్క్ లో ఉన్న మరొక సిస్టం నుండి నుండి Configure చేసినట్లేయితే ఆ సందర్భం లో ఇది ఉపయోగ పడుతుంది.  ఎలాగా అంటే ఇంటర్నెట్ Connect అయి ఉన్న ఉన్న కంప్యూటర్ యొక్క MAC Address ని తీసుకుని ఇక్కడ ఇవ్వవలిసి వస్తుంది.  అపుడు మీ రౌటర్ యొక్క Mac Address మీ కంప్యూటర్ యొక్క Mac Address తో  Update చేయబడుతుంది.

 MAC Address ని తెలుసు కోవడం ఎలా..?

Start->Run ఎంటర్ cmd(Command Prompt) టైపు చేయండి.  ఇపుడు Command Prompt ఓపెన్ అవుతుంది Prompt దగ్గర ”ipconfig/all” అని టైపు చేయండి ఇపుడు కనిపించే నెట్వర్క్ కార్డు లలో మీ network కార్డు గుర్తించి Physical Address (చిత్రం లో చూపిన విధం గా) ని కాపీ చేసుకోండి.
ఇదంతా పూర్తి అయిన తరువాత Apply చేయండి. మీ రౌటర్ మీ ఇంటర్నెట్ సెట్టింగ్స్ తో Update అవుతుంది.

Step  4 : LAN IP Setup

మనం మొదట్లో Netgear Router యొక్క Default Address 192.168.1.1 అని చెప్పుకున్నాం.  ఒకవేళ మీరు నెట్ వర్క్ అడ్రస్ మార్చాలి అనుకుంటే ఇక్కడ చేయలిసి ఉంటుంది. 

కాని ఈ మార్పులు చేయాలి అంటే IP Address మరియు Subnet గురించి కనీస అవగాహన ఉండాలి. 
IP Address గురించి తెలుసుకోవాలి అంటే Click Here
ఇక్కడ మనం ఇచ్చిన మన IP Address రేంజ్ లో మొదటి అడ్రస్ రౌటర్ ది అవుతుంది. అంటే ఇక్కడ మనం ఇచ్చిన 192.168.0.1 లో 192.168.0.1 రౌటర్ అవుతుంది 192.168.0.2 నుండి నెట్ వర్క్ లో ఉన్న కంప్యూటర్ అడ్రస్ ప్రారంభం అవుతుంది.
ఒక వేళ DHCP Enable చేయాలి అంటే కనుక Use Router as DHCP Server టిక్ చేయండి. అంటే ప్రతి కంప్యూటర్ కి Manual  గా Configure  చేయలిసిన అవసరం లేకుండా  ఆటోమాటిక్ గా సిస్టం నెట్ వర్క్ లోకి Connect అయిన వెంటనే DHCP ప్రోటోకాల్ ద్వారా IP Assign చేయడం జరుగుతుంది.
Starting IP Address           2 అంటే 1 అనేది  రౌటర్ ది కనుక తరువాత నెంబర్ నుండి నెట్ వర్క్ మొదలు అవుతుంది.
Ending IP Address అనేది మీ నెట్ వర్క్ లో ఉన్న కంప్యూటర్ ల యొక్క సంఖ్యని బట్టి ఉంటుంది. 
 Step  5 : Address Reservation

మీ నెట్ వర్క్ లో ఏదయినా కంప్యూటర్ కి కాని నెట్ వర్క్ ప్రింటర్, లేదా ఏదయినా నెట్ వర్క్ Device కి Address Reserve చేయాలి అంటే మీరు ఆ Device యొక్క Details ఇక్కడ Add చేయలిసి వస్తుంది.

ఇక్కడ IP Address, MAC Address, Device Name ఎంటర్ చేసి Add Click చేయండి.
LAN IP Setup అనే విభాగం కచ్చితంగా Configure చేయలిసిన అవసరం అయితే లేదు.  Default Settings తో సరిపోతుంది.
Step  6 : Wireless Settings

మీ రౌటర్ లో Wireless enable చేయాలి అంటే Wireless Settings అనే విభాగం క్లిక్ చేయండి.

­Name (SSID):  SSID – Service Set Identifier in Wireless Computer Networking
ఇది నెట్ వర్క్ లో మన Wireless Router యొక్క పేరు ఇక్కడ మీరు ఈ పేరు అయిన ఇవ్వవచ్చు. 
Region : మన Region సెలెక్ట్ చేసుకోండి.  ఇందులో ఇండియా అని లేక పోతే Asia సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది.
Channel : Maximum నెంబర్ సెలెక్ట్ చేసుకోండి.
Mode:
  • g & b – Both 802.11g and 802.11b wireless stations can be used.
  • g only – Only 802.11g wireless stations can be used.
  • b only – All 802.11b wireless stations can be used. 802.11g wireless stations can still be used if they can operate in 802.11b mode.
  • Auto 108 Mbps – All 802.11g, 802.11b, and NETGEAR 108-Mbps wireless stations can be used.
Note: If you select 108-Mbps mode, the WPN824 will only use channel 6.
The default is “g & b”, which allows both “g” and “b” wireless stations to access this device.
Security Options
  • None – no data encryption
  • WEP – Wired Equivalent Privacy, use WEP 64- or 128-bit data encryption
  • WPA-PSK [TKIP] – Wi-Fi Protected Access with Pre-Shared Key, use WPA-PSK standard encryption with TKIP encryption type
  • WPA2-PSK [AES] – Wi-Fi Protected Access version 2 with Pre-Shared Key, use WPA2-PSK standard encryption with the AES encryption type
  • WPA-PSK [TKIP] + WPA2-PSK [AES] – Allow clients using either WPA-PSK [TKIP] or WPA2-PSK [AES]
మీకు అవసరం అయిన Security Method సెలెక్ట్ చేసుకుంది దాని Security కీ ఇవ్వండి.
Configuration పూర్తి అయిన తరువాత Apply క్లిక్ చేయండి.
ఇక్కడితో Basic Configuration పూర్తి అయిపోయింది.  మీరు సాధారణ వినియోగదారులు అయితే ఈ Basic Configuration సరిపోతుంది. 
మరొక్క విషయం ఏమిటి అంటే Configuration చేసే ప్రతి పేజి లో పక్కన Help పేజి ఉంటుంది.  మీకు ఏ అనుమానం ఉన్న ఈ హెల్ప్ మెను చుస్తే చాల సులభంగా అర్ధం అవుతుంది.  మరొక్క విషయం మీ Configuration పూర్తి అయిన తరువాత Logout చేయడం మర్చి పోవద్దు.