Virusని అరికట్టడానికి మార్గాలు

ఈ రోజుల్లో కంప్యూటర్ ని ఉపయోగిస్తున్న హోమ్ యుసేర్స్ నుండి కార్పోరేట్ యుసేర్స్ ఉన్న ప్రధాన సమస్య వైరస్ అందుకే దీని గురించి గత ఆర్టికల్స్ లో వీటిని నివారించడానికి సమర్ధవంతగా పని చేస్తున్న కొన్ని టూల్స్ కోసం సమాచారం ఇవ్వడం జరిగింది.  కాని ఎన్ని సాఫ్ట్ వేర్స్ ఉపయోగిస్తున్నపటికి వీటి నుండి మనం బయటపడలేక పోతున్నాము అంటే చాల మంది మొదటగా తప్పు పట్టేది మనం ఉపయోగిస్తున్న ఎంటి వైరస్ ని అది ఒక కారణం అయినప్పటికీ ప్రధాన కారణం మాత్రం చాల మందికి ఇంటర్నెట్ ఉపయోగించే విధానం ఫై అవగాహన లేకపోవడం.

నేను కస్టమర్ సపోర్ట్ లో  పని చేస్తున్న రోజుల్లో ఇలాంటివి ఎదుర్కొన్నపుడు కంప్యూటర్ ని ఉపయోగించే వినియోగదారుడు చెప్పేదొకటె  నా ఏంటి వైరస్ సరిగా పనిచేయట్లేదు ఈ సందర్భం లో ఒక సారి నాకు ఎదురు అయిన అనుభవం గురించి మీతో తప్పకుండా పంచుకోవాలి “ఒక సారి ఒక డాక్టర్ ఇంటిలో కంప్యూటర్ రిపేర్ అంటే వెళ్ళాను కంప్యూటర్ ఆన్ అవగానే సిస్టం ట్రేలో ఒక మెస్సేజ్ వస్తుంది అది ఏంటి అంటే “Your Hard Disk might be damaged if u want to repair your Hard disk please purchase license version of this copy” అనే మేస్సజ్ వచ్చిన వెంటనే సిస్టం లో ఉన్న అన్ని హార్డ్ డిస్క్ డ్రైవ్ లో కాలిగా చూపిస్తుంది “c”  డ్రైవ్ కూడా . ఇంటర్నెట్ ఉపయోగిస్తున్న వినియోగదారులకు ఇలాంటివి కొకల్లలు ఇలాంటి Fake tools ఎన్నో మనలని భయపెడుతూ ఉంటాయి.
కాబట్టి ఈ క్రింద కొన్ని సూచనలు చేయడం జరిగింది వాటిని కనుక మీరు అనుసరించ గలిగితే కనుక చాలా వరకు ఈ సమస్య నుండి బయటపడవచ్చు.
AntiVirus ఎంపిక:
AntiVirus ని ఉపయోగించడం ఎంత ముఖ్యమో సరయిన Antivirus ని ఎంచుకోవడం అంత కన్నా ముఖ్యం.  మనలో చాల మంది ఇంటర్నెట్ లో లభ్యమయ్యే ఉచిత ఏంటి వైరస్ ఉపయోగిస్తూ ఉంటారు.  ఉపయోగించడం తప్పు కాదు కాని ఇంటర్నెట్ లో లభ్యమయ్యే ప్రతి ఏంటి వైరస్ ఉపయోగించడం అంత మంచిది కాదు ఇందులో చాల వరకు Fake ఏంటి వైరస్ లే ఉంటాయి.  కాబట్టి ఇన్స్టాల్ చేయాలనుకున్న ఏంటి వైరస్ ఆయా ప్రోడక్ట్ కోసం తెలుసుకుని ఉండాలి ఒక వేళ మీరు ఏది మంచిది అని మీరు గ్రహించలేని పక్షంలో ఉచిత ఏంటి వైరస్ లు ఉపయోగించడం ఎంత మాత్రం మంచిది కాదు.  
ప్రొఫెషనల్ ఏంటి వైరస్ ఉపయోగించడం వల్ల కొత్త అప్ డేట్స ఎప్పటికప్పుడు లభిస్తాయి దీని వల్ల కొత్తగా వైరస్ ల యొక్క సమాచారం (Virus Definitions) తో మీ ఏంటి వైరస్ అప్ డేట్ చేయబడుతుంది.  
 
రియల్ టైం ఏంటి స్పై వేర్ ప్రొటెక్షన్(Real time anti spyware Protection):
చాలా వరకు ఏంటి వైరస్ లలో Adware మరియు Spyware ని నివారించే Anti Spyware ఉండదు కాని ఇపుడు కొన్ని ప్రోడక్ట్స్ వీటిని కూడా కలిపి ప్యాకేజీ రూపంలో అందిస్తున్నాయి వీటిని నిర్ధారించు కొన్న తరువాత  మీ ప్రోడక్ట్ ని ఎంపిక చేసుకోవాలి. చాల మంది కంప్యూటర్ యుసేర్స్ సర్వరోగ నివారిణి లాగ ఏంటి వైరస్ ఒకటే ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది అనుకుంటారు కాని అది కరెక్ట్ కాదు.  వైరస్ వేరు అలాగే spyware వేరు కాబట్టి సరిఅయిన ప్రోడక్ట్ ఎంపిక చేసుకోండి.
 
Anti-malware:
Antivirus మరియు Antispyware లు తరచుగా అప్ డేట్ అవవలసిన అవసరం ఉంది ఎంతో ముఖ్యమయిన ఈ అప్ డేట్స్ లేకుండా Anti-malware  ప్రోగ్రాం ఎంత మాత్రం సమర్ధవంతంగా పనిచేయదు.  ముఖ్యంగా ప్రతి యొక్క విండోస్ వ యూసర్ ఈ సెక్యూరిటీ ప్రోడక్ట్ విషయంలో చాల అప్రమతంగా ఉండవలిసి ఉంటుంది.  
 
Antivirus Scanning: 
అనుకోకుండా ఈ వైరస్ లు మరియు Spyware  లు మన సెక్యూరిటీ సిస్టం నుండి ఎస్కేప్ అవుతాయి అలా అయిన ఒకటే రెండే మనకు ఎంతో నష్టం కలిగిస్తాయి.   దీనికి మార్గం ఏమిటి అంటే ప్రతి రోజు తప్పకుండ మీ కంప్యూటర్ ని స్కాన్ చేయండి.  దాని వల్ల మన కంప్యూటర్ లో దాగి ఉన్న వైరస్ ని ఎప్పటికి అప్పుడు నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది.  ఒకవేళ మీకు ప్రతి రోజు మీకు స్కాన్ చేయడం ఇబ్బందిగా ఉంటే ఏంటి వైరస్ లో Schedule సెట్ చేసుకోండి దాని వల్ల మీ ప్రమేయం లేకుండా దాని కదే మేరు సెట్ చేసిన సమయానికి స్కాన్ చేసుకుంటుంది.  అంతే కాకుండా మీ ఏంటి వైరస్ లో Automatic Protection Enable చేసుకోండి దీని వల్ల ఏదయినా వెబ్ సైట్ ఓపెన్ చేసినపుడు వార్నింగ్ మెస్సేజ్ వస్తుంది. 
 
Autorun ని Disable చేయండి:
చాల మంది ఇంటర్నెట్ ఉంటేనే వైరస్ వస్తుంది అనుకుంటారు కేవలం ఇంటర్నెట్ నుండి మాత్రమే కాక ఏదయినా మీడియా ని Insert చేసినపుడు ఆటోమాటిక్ గా దానిలో ఉన్న వైరస్ సిస్టం లోకి ప్రవేశిస్తుంది. అది Pendrive, network Drives, External harddisks, Thumb Drive, Optical media ఎలా ఏదయినా కావచ్చు. వాటిని ఓపెన్ చేసే ముందు  స్కాన్ చేసి వైరస్ లేకుండా ఉంది అని నిర్ధారించుకున్న తరవాతే వాటిని ఓపెన్ చేయండి.
 
Disable image previews in Outlook:
చాల మంది E-Mail Access చేయడం కోసం Outlook ఉపయోగిస్తారు.  ఏదయినా infected మెయిల్ రిసివ్ చేసుకున్నపుడు దానిలో Attached ఇమేజ్ లో వైరస్ enabled code రాయడం జరుగుతుంది ఇలాంటి మెయిల్ Access చేయడం వల్ల  కూడా వైరస్ వ్యాపిస్తుంది.  కాబట్టి Automatic image Preview disable చేయండి.  
 
Don’t Click on email Links or attachments:
ప్రతి విండోస్ యూసర్ తరుచుగా వినే వార్నింగ్ మెస్సేజ్ E-Mail లింక్స్ కాని దాని Attachments క్లిక్ చేయొద్దు.  కాని దురదృష్ట వశాత్తు దీనిని ఎవరు పాటించడం లేదు దాని ఫలితం ఏముంది షరా మామోలె.  అలాంటి మెయిల్ ఓపెన్ చేయడం వల్ల నిమిషాలలో వైరస్ స్ప్రెడ్ అయి విండోస్ పాడవటమే కాక మన సిస్టం లో ఉన్న Critical డేటా కూడా పాడవటం జరుగుతుంది.  
కాబట్టి యుసేర్స్ వైరస్ స్కాన్ చేయకుండా ఈమెయిలు Attachment మీద క్లిక్ చేయడం మంచిది కాదు.
 
ఇంటర్నెట్ బ్రౌసింగ్:
ఇప్పటి వరకు చెప్పుకున్నవి ఒక ఎత్తు అయితే ఇంటర్నెట్ బ్రౌసింగ్ అనేది వైరస్ కి ప్రధానమయిన వనరుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక వెబ్ సైట్ మీకు కావలిసిన ఇన్ఫర్మేషన్ తో పాటు అనేకమయిన లింక్స్ కలిగి ఉంటుంది. కాబట్టి బ్రౌస్ చేసేటపుడు మీకు కావలిసిన లింక్ మాత్రమే క్లిక్ చేయండి అనవసరం అయిన లింక్స క్లిక్ చేయొద్దు దాని వల్ల వైరస్ వచ్చే అవకాశం ఉంది.  
కొన్ని బిజినెస్ క్లాసు ఏంటి మల్వర్ (Anti-malware) లు బ్రౌజరు Plug-ins కలిగి ఉంటాయి దాని వల్ల Malware Infected వెబ్సైటు నుండి రక్షణ లభిస్తుంది.  అంతే కాక Automatic pop-up blockers ఎప్పుడు Enable చేసి ఉంచండి. Pop-up blockers ఇప్పుడు వస్తున్నా అన్ని బ్రౌజరు లోను ఇవ్వబడింది, అలాగే Google’s toolbar మరియు కొన్ని పాపులర్ టూల్ బార్స్ అన్నిటిలోనూ అందుబాటులో ఉంది.  
Site Advisor Plug-in ఎప్పుడు Enable చేసి ఉంచండి దీని వల్ల safe Browsing  చేయగలుగుతారు.
URL ఎంటర్ చేసేటప్పుడు చాల జాగ్రతగా గమనించి క్లిక్ చేయండి లేదంటే మీ ఓపెన్ చేయలి అనుకున్న సైట్ ని పోలి ఉండే మరొక వెబ్సైటు కి redirect అయ్యి మీ ఇన్ఫర్మేషన్ ని దొంగిలించే అవకాశం ఉంది.
అనేక Advertisement లతో మెయిల్స్ ని మనం ప్రతి రోజు మెయిల్ రూపంలో Receive చేసుకుంటూ ఉంటాం ఏవి కొన్ని మనకు ఉపయోగకరంగా ఉన్నప్పటికీ అన్ని మెయిల్స్ సేఫ్ కాదు వాటిలో లింక్స్ క్లిక్ చేయడం వల్ల మీ సిస్టం లో ఇన్ఫర్మేషన్ దొంగిలించే అవకాశం ఉంది.  
 
Hardware ఫైర్ వాల్:
Technology Professionals  ఇప్పటికి Software v/s Hardware based ఫైర్ వాల్ యొక్క ఉపయోగాలు గురించి చర్చ జరుగుతూనే ఉంది. కాని ఏదయినా Network Device ని Access చేయాలి అనుకున్నపుడు ఫైర్ వాల్ వల్ల చిన్న ఇబ్బందులు ఉంటాయి అలాంటి సందర్భం లో సింపుల్ గా ఫైర్ వాల్ ని disable చేసి వాటిని Access చేయడం చేస్తారు. 
కాని ఫైర్ వాల్  malicious Network traffic, Viruses, worms నుండి మన కంప్యూటర్ ని రక్షణ కల్పిస్తుంది.  కాని Software ఫైర్ వాల్ robotic attacks నుండి కాపాడలేదు.  కాబట్టి వీలు అయినంత వరకు Hardware Firewall ఉపయోగించండి.