సాధారణంగా Home Users నుండి Commercial Users వరకు అందరు ప్రతీ రోజు వినే పదం IP Address. అసలు IP Address అంటే ఏమిటి అది ఎలా పని చేస్తుంది? మనం సాధారణంగా ఒక మనిషిని గుర్తించడానికి గాని పిలవడానికి కాని అతని పేరుని ఉపయోగిస్తాము అలాగే నెట్ వర్క్ లో కనెక్ట్ అయి ఉన్న కంప్యూటర్ (Host) ని గుర్తించడానికి మనం ఉపయోగించే దానినే IP Address అంటారు. అసలు ఒక నెట్ వర్క్ లో ఉన్న కంప్యూటర్ (Host) ని గుర్తించడానికి 3 రకాల మార్గాలు ఉన్నాయి.
1. కంప్యూటర్ పేరు (Computer Name)
2. MAC Address (Hardware Address)
3. IP Address
ఈ మూడు కుడా ప్రతి కంప్యూటర్ కి ప్రత్యేకమయినవి గా ఉంటాయి. ఒక చోట ఉపయోగించిన తరువాత ఆ నెట్ వర్క్ మరే ఏ కంప్యూటర్ కి గాని మరే నెట్ వర్క్ Device కి గాని ఉపయోగించే అవకాశం లేదు అంటే ఒక సముదాయం లో ఏ ఇద్దరు వ్యక్తులకు ఒకే పేరు ఉంటే వారిని పిలిచేటపుడు ఇలాంటి అయోమయ పరిస్తితి అయితే ఉంటుందో ఇక్కడ కూడా ఆలాంటి పరిస్తితే ఉంటుంది. కాబట్టి ఒక చోట ఉపయోగించిన వీటిని అదే నెట్ వర్క్ లో వేరొక కంప్యూటర్ కి కాని నెట్ వర్క్ Device కి కాని ఉపయోగించే పరిస్తితి ఎత్తి పరిస్తితిలోను లేదు.
ఇక ఫై మూడు వాటిలో ఒక్కొక్క దాని కోసం వివరం గా తెలుసుకుందాం.
కంప్యూటర్ పేరు (Computer Name)
కంప్యూటర్ పేరు అనేది ప్రత్యేకంగా అన్ని రూల్స్ ఏమి లేక పోయిన నేమ్ పెట్టేటపుడు కొన్ని ప్రాధమిక సూత్రాలు పాటించ వలసి వస్తుంది.
- ఆ నెట్ వర్క్ ఉన్న ప్రతి కంప్యూటర్ కి లేదా ఇతర నెట్ వర్క్ Devices కి ప్రత్యేకంగా ఉండాలి.
- కంప్యూటర్ పేరు 15 అక్షరాలు మించరాదు.
- Space అనేది ఇవ్వ కోడదు అలాగే కొన్ని స్పెషల్ కేరెక్టర్స్ ఉపయోగించడానికి వీలు లేదు (/ * , . ” @).
- విండోస్ విస్టా కి ముందు కేవలం Upper case లో మాత్రమే ఇవ్వాలి అనే రూలే ఉండేది కానీ ఎప్పుడు ఆ నిబందన లేదు.
MAC Address (Hardware Address):
A Media Access Control address (MAC address)
అనేది హార్డ్ వేర్ అడ్రస్ ఇది మన కంప్యూటర్ లో ఉన్న Lan Card లో నిక్షిప్తమయి ఉంటుంది అది ప్రపచం లో ఉన్న ఏ రెండు నెట్ వర్క్ కార్డు లోను ఒకటిగా ఉండదు ప్రతి కార్డు ప్రత్యేక మయినది గా ఉండేటట్టు Institute of Electrical and Electronics Engineers (IEEE) వారు జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ MAC అడ్రస్ నెట్ వర్క్ కార్డు తయారు చేసేటప్పుడు దాని లోని Read Only మెమరీ లో లోడ్ చేస్తారు కాబట్టి మనం దానిని చూడగలం కాని మార్పు చేయలేము. ఈ అడ్రస్ 48bit సైజు తో Hexadecimal ఫార్మటు లో ఉంటుంది.
ఉదాహరణకు 01-23-45-67-89-ab or 01:23:45:67:89:ab గా ఉంటుంది.
ఒకవేళ కనుక మన కంప్యూటర్ యొక్క MAC అడ్రస్ చూడాలి అనుకుంటే కనుక
ఒకవేళ కనుక మన కంప్యూటర్ యొక్క MAC అడ్రస్ చూడాలి అనుకుంటే కనుక
getmac
Ipconfig /all అనే కమాండ్లతో పొందవచ్చు.
IP Address:
IP అడ్రస్ అనేది 32bit Decimal number కలిగి 4 విభాగాలుగా ఉంటుంది. ప్రతి విభాగం 8bit కలిగి ఉంటుంది.
ఉదాహరణకు 203.48.16.43 అనే IP Address లో
8bit-8bit- 8bit-8bit = 32bit
గమనిక: ఇది IPv4 Version అదే IPv6 తీసుకుంటే 128bit అడ్రస్ కలిగి ఉంటుంది, దాని వివరాలు తరువాత తెలుసుకుందాం. ప్రస్తుతానికి మనం ఎక్కువగా ఉపయోగించే IPV4 Version గురించి తెలుసుకుందాం.
అంటే IP అడ్రస్ లో ప్రతి విభాగం 1byte అంటే 8bit గా ఉంటుంది. అంటే IP అడ్రస్ 0-255 డెసిమల్ (Decimal) నెంబర్లు కలిగి ఉంటుంది.
IP Address లో మనం ప్రధానం గా తెలుసుకోవలిసింది వాటి Classes కోసం IP Address 5 Classes గా ఉంటుంది.
Class Range
A 0.0.0.0 to 126.255.255.255
B 128.0.0.0 to 191.255.255.255
C 192.0.0.0 to 223.255.255.255
D 224.0.0.0 to 239.255.255.255
E 240.0.0.0 to 255.255.255.255
అసలు Classes ఏంటి ఈ Confusion ఏమిటి అనుకుంటున్నారా..? ఏమి Confusion అవ్వద్దు,
మనకు సాదారణంగా నెట్ వర్క్ లో LAN, WAN అనేవి ఉంటాయి.
LAN (Local Area Network) మనం పెద్ద పెద్ద definition లకు వెళ్ళకుండా సింపుల్ గా తెలుసుకుందాం. LAN అంటే దానిలో పేరులో ఉన్న విదంగా ఒక నెట్ వర్క్ లో ఉన్న లేదా Connect అయి ఉన్న కంప్యూటర్ ల సముదాయమునే LAN అనవచ్చు.
ఇలా ఒక నెట్ వర్క్ లోని ఒక్క కంప్యూటర్ ని Host అని Workstation అని పిలుస్తారు.
WAN (Wide Area Network) అంటే కొన్ని నెట్ వర్క్ ల సముదాయం పైన మనం చెప్పు కున్న LAN లో కంప్యూటర్ లు అన్ని కలిసి ఉంటే అలాంటి రెండు అంత కంటే ఎక్కువ LAN లు కలిపితే ఒక WAN అవుతుంది.
ఇలా WAN లో ఉన్నపుడు ఒక నెట్ వర్క్ లోని కంప్యూటర్ అదే WAN లోని వేరొక నెట్ వర్క్ లోని కంప్యూటర్ తో కనెక్ట్ అయి ఉన్నపుడు, ఏ కంప్యూటర్ ఏ నెట్ వర్క్ కి సంబందించిందో తెలుసు కోవాలి అంటే అలాంటి సందర్బాలలో ఈ క్లాసెస్ (Class) అనేవి ఉపయోగపడతాయి.
ఇక మీకు Confusion పోయిందని అనుకుంటా ఇక ఒక్కక క్లాసు గురించి వివరంగా తెలుసుకుందాం,
ఇలా ఉన్న నెట్వర్క్ Architecture ని బట్టి ఒక IP Address లో ఉన్న 4 విభాగాలలో కొన్ని నెట్ వర్క్ ని Represent చేస్తే మిగతావి హోస్ట్ ని Represent చేస్తాయి.
Class A:
IP Address లో ఉన్న 4 విభాగాలలో (8bit. 8bit. 8bit. 8bit) మొదటి విభాగం (8bit-Network (N)) నెట్ వర్క్ కోసం మిగిలిన మూడు (8bit.8bit.8bi-Host (H-H-H)) ఆ నెట్ వర్క్ లో ఉన్న కంప్యూటర్ లేదా నెట్ వర్క్ Device లు కోసం కేటాయించ బడింది.
(N.H.H.H) Network-Host-Host-Host
Class B:
IP Address లో ఉన్న 4 విభాగాలలో (8bit. 8bit. 8bit. 8bit) మొదటి రెండు విభాగాలు (8bit-8bit Network (N-N)) నెట్ వర్క్ కోసం మిగిలిన రెండు (8bit.8bit-Host (H-H)) ఆ నెట్ వర్క్ లో ఉన్న కంప్యూటర్ లేదా నెట్ వర్క్ Device లు కోసం కేటాయించ బడింది.
(N.N.H.H) Network- Network -Host-Host
Class C:
IP Address లో ఉన్న 4 విభాగాలలో (8bit. 8bit. 8bit. 8bit) మొదటి మూడు విభాగాలు (8bit-8bit-8bit Network (N-N-N)) నెట్ వర్క్ కోసం మిగిలిన ఒక్కటి (8bit-Host (H)) ఆ నెట్ వర్క్ లో ఉన్న కంప్యూటర్ లేదా నెట్ వర్క్ Device లు కోసం కేటాయించ బడింది.
(N.N.N.H) Network- Network – Network –Host
Class D:
దీనిని Multicasting కోసం ఉపయోగిస్తారు.
Class E:
ఈ క్లాసు ఇంక వాడుక లోకి రాలేదు.
ఉదాహరణకు XX.YY.ZZ.AA అనేది ఒక IP Address అనుకుంటే
Class A లో XX అనేది Network ID YY.ZZ.AA అనేది Host ID
Class B లో XX.YY అనేది Network ID ZZ.AA అనేది Host ID
Class C లో XX.YY.ZZ అనేది Network ID AA అనేది Host ID
ఈ విధంగా మనం IP Address ని వివిధ సందర్భాలలో మన అవసరాన్ని బట్టి ఏ క్లాసు అనేది ఎంపిక చేసుకోవచ్చు.
ISP లు సాధారణంగా Class B ని ఉపయోగిస్తూ ఉంటారు.
ఇక తరువాత ఆర్టికల్ లో Subnetting, IP Address ఎలా Configure చేయాలో తెలుసుకుందాం