స్టీవ్ జాబ్స్ గాపిలువబడే స్టీవెన్ పాల్ జాబ్స్ యాపిల్ఇన్కార్పొరేటేడ్కు చైర్మెన్ మరియుCEO. పిక్సర్ అనిమేషన్ స్టూడియోస్కుకూడాకొద్దికాలం CEOగాఉన్నాడు. కంప్యూటర్ రంగంలో మరియు వినోదంపరిశ్రమలో తిరుగులేని విజయాలను సాధించి ప్రపంచంలోనే ఒకానొక గొప్ప వ్యాపారవేత్తగా పేరుపొందాడు.
ప్రారంభజీవితం
1944 ఫిబ్రవరి 24న శాన్ ఫ్రాన్సిస్కోలో జన్మించిన కొద్దిరోజులకే పాల్మరియుక్లారాజాబ్స్దంపతులు దత్తత తీసుకున్నారు. కాలిఫోర్నియాలోని క్యూపర్టినోలో హైస్కూల్ చదువుపూర్తిచేసి1972లో వోరెగాన్ రాష్ట్రంలోని పోర్ట్లాండులో రీడ్ కాలేజీలో చేరాడు. జాబ్స్కుచిన్నప్పటినుండి అధ్యాత్మిక విషయాలపైనచాలాఆసక్తి. ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు అయినభారతదేశాన్ని సందర్శించడానికి అవసరమయిన డబ్బుకోసంఒకవీడియోగేమ్స్కంపెనీలో చేరాడు. కొన్నాళ్ళు అక్కడపనిచేసి తగినంతడబ్బుచేకూరిన తర్వాతతనకాలేజ్ఫ్రెండ్ అయినడేనియల్తో(ఇతడుతర్వాతఆపిల్కంపెనీలో మొట్టమొదటి ఉద్యోగి అయ్యాడు) కలసిభారతదేశ పర్యటనచేసివేదాంత, ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకొన్నాడు. తర్వాతనున్నని గుండుతో, భారతీయసాంప్రదాయ దుస్తులతో అమెరికాకు వెనుతిరిగాడు. అమెరికాకు తిరిగివచ్చినతర్వాతతిరిగిఅదేకంపెనీలో తనఉద్యోగాన్ని కొనసాగిస్తూ తనచిరకాలమిత్రుడు అయినస్టీవ్వోజ్నైక్తో కలసి కంప్యూటర్ చిప్‌ల గురించి పనిచేసి కొత్తవిషయాలు కనుగొన్నాడు.
యాపిల్కంప్యూటర్
1976లో స్టీవ్వోజ్నైక్ భాగస్వామ్యంతో ఆపిల్కంపెనీని స్థాపించాడు. మొదటప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు మాత్రమే తయారుచేయాలనుకున్నా, చివరకుపూర్తికంప్యూటర్లు తయారుచేయగలిగారు. మొట్టమొదటి కంప్యూటర్ను666.66 డాలర్లకు అమ్మారు. అప్పటినుండి ఆపిల్కంపెనీకంప్యూటర్ రంగంలోకీలకస్థానాన్ని ఆక్రమించింది. 1980లో IPO వలన జాబ్స్కోటీశ్వరుడయ్యాడు. 1984లో ప్రవేశపెట్టబడిన మ్యాకింటోష్ మరొకఅత్యద్భుత మైలురాయిగా నిలిచిపోయింది.
ఆపిల్కంపెనీని ఎంతోఉన్నతస్థాయికి తీసుకెళ్ళిన జాబ్స్పద్దతులు కొందరుఉద్యోగులకు నచ్చేవి కాదు. 1984 చివరలో ఏర్పడిన మాంద్యం వల్లఆశించినమేరకు వ్యాపారం జరుగకపోవడంతో 1985లో జాబ్స్నుమ్యాకింటోష్ విభాగఅధిపతిపదవినుండి తొలగించారు.
NeXT
తానుప్రారంభిన కంపెనీలో తనకుప్రాముఖ్యత లేకపోవడంతో జాబ్స్ 1986లో ఒక్కటి తప్పతనవద్దఉన్నఅన్నిషేర్లుఅమ్మివేసాడు. ఆఒక్కషేర్పెట్టుకోవడం వెనుకరకరకాలకారణాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. తానుకూడాఆపిల్కంపెనీస్టాక్రిపోర్ట్ అందుకోవడానికి, కంపెనీసమావేశాల్లో పాల్గొనడానికి ఆఒక్కషేర్ఉపయోగపడుతుందని జాబ్స్దానినిఅలాగేపెట్టుకొన్నాడు అనిఒకకథనం.
తనదగ్గరఉన్నడబ్బుతో NeXT అనేకంపెనీప్రారంభించాడు. ఈకంపెనీతయారుచేసినకంప్యూటర్లు ఎంతోఉన్నతప్రమాణాలు కలిగిఉన్నా, చాలాఖరీదయినవి కావడంతో ఎక్కువమంది కొనలేదు.
తిరిగిఆపిల్కు
స్టీవ్జాబ్స్లాంటివ్యక్తి అవసరంగ్రహించిన ఆపిల్డైరక్టర్లు NeXT ను429 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసారు. అపుడుజరిగినఒప్పందంలో భాగంగాస్టీవ్జాబ్స్మళ్ళీఆపిల్కంపెనీకి తాత్కాలిక CEOగానియమితుడయ్యాడు. కంపెనీని లాభాల్లో నడిపించడంలో భాగంగాఅప్పుడు నడుస్తున్న కొన్నిప్రాజెక్టులను పూర్తిగా ఆపివేసాడు. ఆవిభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను పనిలోనుండి తొలగించాడు. కంపెనీని లాభాలబాటలో తీసుకెళ్ళడంలోముఖ్యపాత్ర వహించడంతో 2000లోపూర్తిస్థాయి CEO అయ్యాడు.
కంప్యూటర్లు మాత్రమే కాకుండా పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్ అయిన ఐపాడ్ను ఆవిష్కరించి ఆపిల్ను ఎవరూ అందుకోలేని స్థానానికి తీసుకెళ్ళిన ఘనతస్టీవ్జాబ్స్కు దక్కుతుంది.
జీతం
ఆపిల్కంపెనీCEOగాజాబ్స్జీతంసంవత్సరానికి కేవలంఒక్కడాలరు($1) మాత్రమే. ప్రపంచంలో అత్యల్ప జీతంతీసుకొనే CEO గాగిన్నీస్ బుక్లో స్టీవ్ జాబ్స్పేరునమోదయింది. జాబ్స్కు ప్రస్తుతం ఆపిల్కంపెనీలో 7,500,000 షేర్లు ఉన్నాయి. 2007 ఫోర్బ్స్ జాబితాప్రకారం స్టీవ్జాబ్స్ఆస్థివిలువ5.7 బిలియన్ డాలర్లు.
పిక్సర్మరియుడిస్నీ
1986లో 10 మిలియన్ డాలర్లకు పిక్సర్ అనేగ్రాఫిక్స్ కంపెనీని కొన్నాడు. ఈకంపెనీనిర్మించే చిత్రాలకు ఆర్థికసహాయంచేయడానికి, పంపిణీచేయడానికి డిస్నీకంపెనీతో కాంట్రాక్టు యేర్పరుచుకుంది.
మొట్టమొదటి సినిమాఅయినటాయ్స్టోరీ 1995లో విడుదలయి ఘనవిజయాన్ని సాధించింది. ఆతర్వాతపదేళ్ళపాటు వరుసగాప్రతిసినిమాఘనవిజయాన్ని సాధిస్తూ వందలమిలియన్ డాలర్లు లాభాలను ఆర్జించాయి. ఈసంస్థనిర్మించిన కొన్నిసినిమాలు: ఎబగ్స్లైఫ్, టాయ్స్టోరీ2, మాన్స్టర్స్.ఇన్క్, ఫైండింగ్ నీమో, దిఇన్క్రెడిబుల్స్, కార్స్, రాటటూయి.
డిస్నీతో కాంట్రాక్టు పూర్తిఅయినతర్వాతయేర్పడిన మనస్పర్థలవల్ల పిక్సర్ ఇంకోకాంట్రాక్టును వెతుక్కోవడం మొదలుపెట్టింది. అపుడుడిస్నీకి వచ్చినకొత్తCEO పిక్సర్ను7.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడానికి ప్రతిపాదన చేసాడు. జాబ్స్అందుకుఒప్పుకొన్నాడు. అప్పటినుండి డిస్నీ–పిక్సర్ కలసి నిర్మిస్తున్న సినిమాల వ్యవహారాలు చూసేఆరుగురు సభ్యులకమిటీలో జాబ్స్ఒకడుగాఉంటున్నాడు.
అక్టోబర్ 3, 2011 న Cancer వ్యాధితో చనిపోయేవరకు IT రంగం లో ఎన్నో నూతన అవస్కరణలు చేయడం జరిగింది. ఇలాంటి గొప్ప మేధావి చనిపోవడం ఎంతయినా మనకు తీరని లోటు.
Allow Blog Feeds