సేఫ్ గా ఉంచే సెక్యూరిటీ టూల్స్

ఈ రోజు కంప్యూటర్ యుసేర్స్ ప్రదానంగా ఎదుర్కుంటున్న సమస్య Virus పేరుకి Virus అని ఒక మాటలో చెపుతున్న అప్పటికి ఇది అనేక శాఖలుగా విభాజిపబడి ఉంది.  ఒక్క విభాగాన్ని బట్టి దాన్ని ప్రవర్తన అదే హాని చేసే విధానం అధరాపడి ఉంది.  ఏది ఏమయినా చివరికి ఇబ్బంది బడేది యూసర్. 
సెక్యురిటీ సాఫ్ట్ వేర్ ఉపయోగిస్తున్నప్పటికీ…!
ఇంటర్నెట్ ఉపయోగించే వారిలో ఎక్కువ శాతం సెక్యురిటీ సాఫ్ట్ వేర్ ఉపయోగిస్తున్నారు.  అయినప్పటికీ సమస్యలు వస్తుంటాయి.  దీనికి కారణం ఈ సెక్యురిటీ సాఫ్ట్ వేర్ సమర్దవంతంగా పని చేయకపోవడమే. నెట్ సెక్యురిటీ కి సంబదించి అనేక సాఫ్ట్ వేర్ అందుబాటులో ఉన్నపటికీ వీటిలో కొన్ని మాత్రమే చక్కగా పనిచేస్తున్నాయి.
Norton Internet Security : కంప్యూటర్ కు ఇంటర్నెట నుండి ప్రమాదాలు రాకుండా తగిన భద్రత కల్పిచడంలో ఈ సెక్యురిటీ సాఫ్ట్ వేర్ చాలా చక్కగా పనిచేస్తుంది.  ఇంటర్నెట్ ద్వారా వచ్చే  ఎటువంటి సమస్యనైన ఈ సాఫ్ట్ వేర్ ద్వారా పరిష్కరించవచ్చు.  ఈ సాఫ్ట్ వేర్ ద్వారా వైరస్ లను, స్పి వేర్ లను సిస్టం ప్రవేశించకుండా నిరోదించవచ్చు.  ఏంటి వైరస్ , ఏంటి స్పి వేర్ టూల్స్ లతో పాటు ఫైర్ వాల్ యుటిలిటి కుడా ఈ సూట్ లో ఉంటుంది.  కొత్తగా ఈ సూట్ ప్రవేశపెట్టిన Identity safe ద్వారా కీలకమయిన పాస్ వర్డ్ లను, వ్యక్తిగత సమాచారాన్ని జాగ్రతగా కాపాడుతుంది.

 

Trend Micro InternetSecurity : ఈ సాఫ్ట్ వేర్ ద్వారా ఎటువంటి Malware నైన సులువుగా నివారించవచ్చు.  Norton Internet Security తరవాత పేరు పొందిన సెక్యురిటీ టూల్ ఈ Trend Micro.

 

ZoneAlarm InternetSecurity : Spyware నిరోదించడం లో అదే విదంగా ఇతరులు సిస్టం లోకి ప్రవేశించకుండా కాపాడే ఫైర్ వాల్ విషయంలో ఈ సూట్ చక్కగా పని చేస్తుంది.  ఇంటర్నెట్ సెక్యురిటీ విషయంలో ఈ ముడు రకాల సాఫ్ట్ వేర్ లో ఏదో ఒకటి ఉపయోగిస్తే సరిపోతుంది. 

 

స్పామ్ ని నిరోదించే సాఫ్ట్ వేర్ :

ఇంటర్నెట్ యుసేర్స్ నిత్యం చూస్తున్న మరో ప్రధాన మయిన సమస్య స్పామ్ (Spam).    స్పామ్ (Spam)ద్వారా మీకు అనేక మెసేజ్ లు, అనవసర సమాచారం మీ సిస్టం లో వచ్చి చేరుతుంది.  తద్వారా స్పామ్ (Spam), వైరస్ లు సిస్టం లోకి వచ్చే అవకాసం ఉంది.  స్పామ్ (Spam)ని కొన్ని రకాల యంటి స్పామ్ సాఫ్ట్ వేర్ గురించి తెలుసుకుందాం.

 

Cloudmark DesktopOne :  Microsoft Outlook ద్వారా మెయిల్స్ ని, Receive చేసుకోవడం, పంపడం జరుగుతుంటే ఈ సాఫ్ట్ వేర్ చక్కగా ఉపయోగపడుతుంది.  అనేక మంది వెబ్ ద్వారా కాకుండా ఆవుట్ లుక్ నుండి e-mail  ని నిర్వహిస్తూ ఉంటారు.  ఈ సాఫ్ట్ వేర్ ని ఇన్ స్టాల్ చేసుకోవడం ద్వారా స్పామ్ ని పూర్తిగా నిరోదించగలం.

iHateSpam : స్పామ్ నిరోదించడంలో ఉపయోగపడే మరో యుటిలిటీ సాఫ్ట్ వేరే iHateSpam.  ఈ సాఫ్ట్ వేర్ కుడా అవుట్ లుక్ యుసేర్స్ కి చక్కగా ఉపయోగపడుతుంది.

 

AntiSpyware 

 

Spyware నిరోదించడంలో ప్రత్యేకంగా కొన్ని రకాల సాఫ్ట్ వేర్ అందుబాటులో ఉన్నాయి.  నెట్ ని ఉపయోగించే సమయంలో మనకు తెలియకుండానే సిస్టం లోకి ప్రవేసించే spyware ద్వారా సిస్టం సక్రమంగా పని చేయకుండా నిలిచి పోతుంది.

Spyware Doctor : సిస్టం లోకి ప్రవేశించే Spyware ని తొలగించడంలో అదే విదంగా Spyware ప్రవేశించకుండా నివారిచడంలో Spyware Doctor చాలా చక్కగా పని చేస్తుంది.  నెట్ యుసర్స్ తప్పని సరిగా ఉపయోగించ వలసిన సాఫ్ట్ వేర్ ఈ Spyware Doctor.  నేడు నెట్ లో వైరస్ ల తరవాత Spyware పలు రకాల సమస్యలును సృష్టిస్తుంది.  కావున తప్పకుండా Spyware Doctor సిస్టం లో ఇన్స్టాల్ చేసుకోవలిసిందే.  Spyware Doctor యాంటి వైరస్ టూల్ తో  పాటు అందుబాటులో ఉంది.

Net Nanny : ఇంటర్నెట్ లో ఉచితంగా లభించే ఈ సాఫ్ట్ వేర్ ద్వారా నెట్ కి సబందించిన కొన్ని ఫీచర్స్ ని కంట్రోల్ చేయగలం.  ఈ సాఫ్ట్ వేర్ లోని కంటెంట్ ఫిల్టరింగ్, ఇన్ స్టంట్ మేనేజింగ్ మోనిటరింగ్… వంటి ఫీచర్స్ ద్వారా చిన్న పిల్లలు వారి అవసరం మేరకు మాత్రమే ఉపయోగించగలరు.  ఉదాహరణకు కంటెంట్ ఫిల్టరింగ్ ద్వారా అశ్లీల పరమయిన కంటెంట్ఏదయినా ఉంటె దాన్ని బ్లాక్ చేస్తుంది.  అదీ విదంగా చాటింగ్ లో కుడా చిన్న పిల్లలు తప్పులు చేయకుండా మోనిటర్ చేస్తుంది.

 

SiteAdvisor

 

ఈ యుటిలిటీ ద్వారా మనం ప్రస్తుతం సర్ఫింగ్ చేస్తున్న వెబ్ సైట్స్ సంబదించిన కొన్ని వాస్తవ పరిస్థితులు తెలుస్తుంటాయి.  వెబ్ సైట్ ద్వారా ఏదయినా ప్రమాదం ఉంటె వెంటనే తెలియ చేస్తుంది. దీని ద్వారా సైట్ బ్రౌసింగ్ చేయకుండా నిలిపివేయ వచ్చు.

 

Malware Protection 

 

పలు రకాలగా ఇబ్బంది పెట్టె Malware నుంచి సిస్టం ని ప్రొటెక్షన్ ఇవ్వాలి అంటే Malware Protection టూల్స్ చక్కగా ఉపయోగపడతాయి. ఎక్కడ చెప్పుకునే టూల్స్ అన్నిటిని నెట్ నుండి ఉచితంగా డౌన్ లోడ్ చేసుకునే వీలు ఉంది.

Avast Free Antivirus : ఈ సాఫ్ట్ వేర్ ద్వారా Malware రాకుండా సిస్టం ని ప్రొటెక్ట్ చేయగలం.  Spyware, Virus… వంటి ఎ Malware నైన సిస్టం లోకి ప్రవేశించకుండా Avast Free Antivirus పనిచేస్తుంది.

ThreatFire AntiVirus : Malware ని సమర్దవంతం గా బ్లాక్ చేయడం లో ఉపయోగపడే మరో సెక్యురిటీ సాఫ్ట్ వేర్ ThreatFire.  ఉచితంగా లభించే ఈ సాఫ్ట్ వేర్ ద్వారా మీ సిస్టం కి తగిన రక్షణ కల్పిచ వచ్చు.

Comodo Firewall : నెట్ లో ఉచితంగా లబించే ఈ సాఫ్ట్ వేర్ మీ సిస్టం లోకి ఇతరులు ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. తద్వారా కీలక డేటా ను ఇతరులు తస్కరించలేరు.

 

ఇవే కాక నేడు అనేక టూల్స్ మనకు అందుబాటులో ఉన్నాయి.  మన అవసరాన్ని బట్టి తగిన టూల్ ఎంచుకోవాలి.  తరువాత ఆర్టికల్ లో మరి కొన్ని టూల్స్ గురించి తెలుసుకుందాం.  ఈ ఆర్టికల్ ఎటువంటి సందేహాలు ఉన్న మాకు మెయిల చేసి మీ సందేహాలు తీర్చుకోండి.