విండోస్ 7 రిపేర్ డిస్క్ క్రియేట్ చేయడం

ఎటువంటి థర్డ్ పార్టీ యుటిలిటీ అవసరం లేకుండానే విండోస్ 7 ద్వారా రిపేర్డిస్క్ క్రియేట్ చేయవచ్చు దీని వల్ల ఎపుడు అయిన ఆపరేటింగ్ సిస్టం లో ఏదయినాప్రాబ్లం వచ్చినపుడు సిస్టం లో ఎటువంటే మార్పులు చేయకుండానే Repair చేసుకోవచ్చు. దీనికి కావలిసింది కేవలం ఒక కాలి CD మాత్రమే.
ఇపుడు డిస్క్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాము.
ముందుగా స్టార్ట్ మెను లో సెర్చ్ లో System Repair Disc అనిటైపు చేయండి.

ఇపుడు Create a System Repair Disc అనేలింక్ మీద click చేయండి.
ఇపుడు ఒక Dialog box ఓపెన్ అవుతుంది దానిలో CD/DVD పాత్ సేలేక్ట్చేసుకుని ok చేయండి. దీనికికేవలం 142MB స్పేస్ మాత్రమేతీసుకుంటుంది.
ఈ డిస్క్ ని ఉపయోగించడం ఎలా?
ఎపుడు అయిన ఆపరేటింగ్ సిస్టం సమస్య వచ్చినపుడు ఈరిపేర్ డిస్క్ తో బూట్ అవ్వండి. అది WindowsSetup [EMS Enabled] స్క్రీన్ ఓపెన్ అవతుంది.
ఇపుడు ఎంటర్ అయిన తరువాత System Recovery Option విండో ఓపెన్అవుతుంది.
విండోస్ ఇన్ స్టాల్ అయిన Partition సెలెక్ట్ చేసుకుని ఓకే Next క్లిక్ చేయండి.ఇపుడు వివిధ రకాల System Recovery Options వస్తాయి. మీకు అవసరమయిన దానిని సెలెక్ట్ చేసుకొండి.
సిస్టం రికవరి ప్రాసెస్ అయిన తరువాత సిస్టం దానిఅంతట అదే రీస్టార్ట్ అవుతుంది ఇపుడు Recovery Disk తీసివేసి హార్డ్ డిస్క్ నుండి సిస్టం ని బూట్ చేయండి.