లినక్సు గురించి తెలుసుకుందాం పార్ట్ -1

 

టక్స్, ఒక కార్టూను పెంగ్విను  సాధారణంగా
కూర్చోని  ఉన్నట్లు  చూపిస్తారు, ఇది లినక్స్
యొక్క ఆధికారిక చిహ్నం

లినక్స్ ఒక కంప్యూటరు ఆపరేటింగు సిస్టము మరియు దీని Kernal ఉచిత సాఫ్ట్ వేర్ నకు మరియు ఓపెన్ సోర్సు సాఫ్ట్ వేర్ నకు ప్రసిద్దిగాంచిన ఒక ఉదాహరణ. మైక్రోసాఫ్ట్ విండోసు ఆపరేటింగు సిస్టము లేదా మ్యాక్ / మెకింటొష్ ఆపరేటింగ్ సిస్టముల వలే కాకుండా లినక్స్ సోర్సు కోడు ప్రజలకు అందుబాటులో లభించడమే కాక ఉచితంగా కూడ లభిస్తుంది. ఆసక్తి ఉన్నవారు దీనిని ఉచితంగా దిగుమతి చేసుకోవచ్చుమార్పులు చేర్పులు చేయవచ్చుతిరిగి పంచిపెట్టవచ్చు.

లినక్స్ నిజానికి దాని కెర్నల్ యొక్క పేరుకానీ సామాన్యంగా యునిక్స్ వంటి ఆపరేటింగు సిస్టము అయిన లినక్స్ ఆపరేటింగు సిస్టమును మొత్తాన్ని గుర్తించడానికి వాడతారు. దీనిని కొద్దిమంది  GNU/ లినక్స్ ఆపరేటింగు సిస్టమ్ అని పిలవాలి అని చెపుతారు. ప్రారంభంలోలినక్స్ కొద్దిమంది ఉత్సాహవంతులు అభివృద్ధి చేశారు. ఆ తరువాత ప్రముఖ కార్పొరేషన్లయిన IBM, HP మరియు Novel వంటి సర్వర్లలో ఉపయోగించడంలో సహాయం చేసినాయిఅలాగే డెస్కుటాప్ కంప్యూటర్లలోనూ ప్రాధాన్యత పొందినది. విశ్లేషకులు దీని విజయానికితక్కువ ఖర్చుపటిష్ఠమైన భద్రతవిశ్వసనీయత వంటివి కారణాలుగా చెపుతారు.
లినక్స్ మొదట Intel 386 మైక్రో ప్రొసెసర్ కొరకు అభివృద్ధి చేసినారు. కాని ఇప్పుడు అన్ని ప్రముఖ కంప్యూటరు ఆర్కిటెక్చరు లపై పనిచేస్తుంది. దీనిని ఎంబెడెడ్ పరికరాలుమొబైల్ ఫోన్లువ్యక్తిగత వీడియో రికార్డర్లువ్యక్తిగత కంప్యూటరులుసూపరు కంప్యూటరు లపై  ఉపయోగించారు!
చరిత్ర

 

1993 వ సంవత్సరములో రిచర్డు స్టాల్‌ మన్‌ GNU ప్రాజెక్టును స్థాపించినాడు. ఇది ఈ రోజు లినక్స్ సిస్టముకు కావలసిన అన్ని విభాగాలను చాలావరకు చేకూరుస్తుంది. GNU స్థాపించినప్పుడుదాని లక్ష్యం ఓ సంపూర్ణ యునిక్స్ వంటి ఆపరేటింగు సిస్టమును అభివృద్ధిచేయడముఅదీ పూర్తిగా ఉచిత  సాఫ్ట్ వేర్ ల సహాయముతో. 1990 వ దశకం తొలి నాళ్ళకల్లా ఈ GNU ఒక ఆపరేటింగు సిస్టమునకు కావలసిన అన్ని విభాగాలనులైబ్రరీలను అప్లికేషన్లను రూపొందించినది. కానీ ఒక ముఖ్యమైన విభాగమయిన దిగువ వ్యవస్థ అయిన కెర్నలు మాత్రము రూపొందింపబడలేదు. కెర్నలు కోసం ఈ GNU ప్రాజెక్టు మొదట TRIX Kernal రూపొందించినది. ఆ తరువాత దాని అభివృద్ధిని నిలిపి GNU HURD అను మరొక కెర్నలును రూపొందించడం మొదలుపెట్టినారు. థామస్‌ బుష్నెల్‌ ప్రకారం మొదట HURD నిర్మాణ శైలి BSD 4.4 లైట్‌ కెర్నలును అనుసరించాలనికానీ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంబెర్కిలీ నుండి సరి అయిన సహాయం లేని కారణంగాప్రోగ్రామర్లు మరియు స్టాల్‌ మన్‌ Mach Microkernel నిర్మాణ శైలిని అనుసరించాలని నిర్ణయించినారు. కానీ ఈ నిర్ణయం వల్ల చాలా అనుకోనిఊహించని ఇబ్బందులు వచ్చి హర్డ్‌ నిర్మాణం చాలా ఆలశ్యం అయినది.

యునిక్స్ సిస్టముల filiation.
ఈ లోపులో 1991లో మరొక కెర్నలు మరియూ mdash  “లినక్స్” మరియు mdash అని పిలవబడినవిఒక ఫిన్లాండుయూనివర్సిటీ విద్యార్థి అయిన  Linus Torvalds University of Helsinki విద్యార్థిగా ఉన్నప్పుడు అభివృద్ధి చేయడం మొదలుపెట్టినాడు. మొదట టోర్వాల్డ్సు MINIX  ను  ఉపయోగించినారు. ఇది  Andrew S. Tanenbaum ఆపరేటింగు సిస్టము నేర్పడం కోసం వ్రాసిన ఒక యునిక్సు‌ వంటి సిస్టము. కానీ  Andrew S. Tanenbaum ఇతరులు తన ఆపరేటింగు సిస్టమును మార్చడానికి అనుమతి ఇవ్వలేదు. దీనివల్ల టోర్వాల్డ్సు MINIX కు  బదులుగా మరొక ఆపరేటింగు సిస్టము రూపొందించడము మొదలుపెట్టినాడు. లినక్స్ మొదట IA-32 అసెంబ్లీ లాంగ్వేజి మరియు C లాంగ్వేజి లో వ్రాయబడిన terminal emulatorదీనిని బైనరీ ఫాములోనికి కంపైలుచేయబడి ఫ్లాపీ డిస్కునుండి బూటు చేయసాగినారుతద్వారా దీనిని ఏ ఆపరేటింగు సిస్టము తోటీ సంబంధములేకుండా ఉపయోగించడం వీలు కలిగినది. ఈ టెర్మినలు ఎమ్యులేటరు రెండు థ్రెడ్లుఒకటి సీరియలు పోర్టు నుండి అక్షరాలు పంపించడానికిమరొకటి స్వీకరించడానికి ఉపయోగపడేవి. తరువాత లినక్స్ డిస్కు నుండి ఫైల్లు వ్రాయడం చదవడం చేయవలసినప్పుడు ఈ టాస్క్‌ స్విచ్చింగు టెర్మినలు ఒక సంపూర్ణ ఫైలు హాండ్లరుగా అభివృద్ధిచేయబడినది. ఆ తరువాత ఇది ఒక సంపూర్ణ ఆపరేటింగు సిస్టముగా అభివృద్ధిచేయబడినది. ఇది POSIX సిస్టముల అనుసంధానమునకు వీలుగా రూపొందించబడినది. లినక్స్ కెర్నల్ తొలి రూపాంతరం 0.01 సెప్టెంబరు 17, 1991నాడు ఇంటర్నెటులో విడుదలచేయబడినది. ఆ తరువాత రెండవ వర్షను వెంటనే అనుసరించినదిఆ తరువాత ప్రపంచం నలుమూలలనుండీ వేలాది సాఫ్ట్ వేర్ డవలపర్లు దీని అభివృద్ధిలో భాగస్వాములై ఒక పూర్తి ఆపరేటింగు సిస్టము రూపొందించినారు. Eric S. Raymond’s యొక్క The Cathedral and the Bazaar లినక్స్ కెర్నల్ అభివృద్ధి విధానమును వివరిస్తుంది.
రిచర్డు స్టాల్ మన్ , ఉచిత ఆపరేటింగు సిస్టము యొక్క 
ప్రాజెక్టు  అయిన జీ యన్ యూ స్థాపకుడు
లినస్ టోర్వాల్డ్సు
లినక్స్ కెర్నల్ సృష్టికర్త

0.01 రిలీసు నాటికి, GNU BASH Shell ను రన్ చేయడానికి లినసు చాలా వరకు పొసిక్సు సిస్టమ్ కాల్సును అనువర్తింపచేసాడు; దీని తరువాత బూట్ స్ట్రాపింగ్ చేసే పద్దతి, అభివృద్ధి చాలా వేగంగా జరిగాయి. లినక్స్ ను configure, compile, మరియు install చేయడానికి మొదట్లో మినిక్స్ తో run అయ్యే కంప్యూటరు అవసరమయ్యేది. లినక్స్ యొక్క తొలి version లను హార్డ్ డిస్క్ నుండి బూట్ చేయడానికి తప్పని సరిగా ఒక ఆపరేటింగు సిస్టము అది వరకే ఉండవలసి వచ్చేది. కాని తొందరలొనే స్వతంత్ర బూట్ లోడర్లు వచ్చాయి, వాటిలో చాలా ప్రసిద్దమయినది, లిలొ. లినక్స్ సిస్టమ్ చాలా త్వరగా functionality లో మినిక్స్ ను అధిగమించింది; టార్వోల్డ్సుమరియు ఇతర లినక్స్ కెర్నెల్ డెవలొపర్లు, ఒక సంపూర్ణమైన, fully functional, ఉచిత ఆపరేటింగ్ సిస్టమ్ ను తయారు చేయడానికి కెర్నెల్ ను GNU విభాగాలతో మరియు యూసర్ స్పేస్ ప్రోగ్రామ్ లతో పని చేయించసాగారు.  ఈ రోజు కూడా Linus Torvalds కెర్నెల్ అభివృద్ధిని నిర్దేశిస్తున్నాడు, కాని GNU విభాగాల వంటి ఇతర సబ్ సిస్టం లు మాత్రం విడిగా అభివృద్ధి అవుతున్నాయి. ఒక కలగలిపిన సిస్టమ్ ను తయారు చేయాలనే ప్రయత్నము, బేసిక్ విభాగాలు, గ్రాఫికల్ ఇంటర్ ఫేస్ లు (GNOME లేదా KDE , ఇవి X Windows system పైన ఆధారపడతాయి), మరియు అప్లికేషన్ సాఫ్ట్ వేర్ లన్నిటినీ కలపడము ప్రస్తుతము లినక్స్ డిస్ట్రిబ్యూషన్ అమ్మకందారులు / సంస్థల చేత చేయబడుతుంది.

టక్స్ అనే పెంగ్విన్ లినక్స్ యొక్క లోగో మరియు మస్కట్, ( వేరేవి ఉన్నప్పటికీ, చాలా తక్కువగా వాడబడతాయి), లారీ ఎర్వింగ్ 1996 లో తయారు చేసిన బొమ్మ మీద అధారపడి తయారుచేయబడింది.

లినక్స్ అనే పేరు మొదట Torvalds చేత కాక Ari Lemmke  చేత పెట్టబడింది. Lemmke Helsinki University of Technology  (HUT), ఎస్పూ హెల్సిన్కి దగ్గరలో ftp.funet.fi కు అడ్మినిస్ట్రేటర్ గా పనిచేస్తుండేవాడు ftp సర్వరు ఫిన్నిష్ యూనివర్సిటీ మరియు రీసెర్చు నెట్వర్కు (FUNET)కు చెందిందిదానిలో చాలా ఆర్గనైజేషన్లు భాగంగా ఉండేవివాటిలో కొన్ని HUT మరియు యూనివర్సిటీ ఆఫ్ హెల్సిన్కిఅతను టార్వోల్డ్సుయొక్క ప్రాజెక్ట్ మొదట్లో డౌన్లోడ్  కు ఉపయోగించిన డైరక్టరీ కిఆ పేరు ఉపయోగించిన వాడిలో ఒకడు. (లినక్స్ అనే పేరు లినస్ యొక్క మినిక్స్ నుండి సాధింబడింది.) ఆ తరువాత ట్రేడ్ మార్క్ చేయబడింది.

లినక్స్ కెర్నల్

Linux Kernal

ప్రతి ఆపరేటింగ్ సిస్టంని మూడు భాగాలుగా విభజించ వచ్చు. అవి కెర్నెల్షెల్ మరియు అప్లికేషన్లు గా చెప్పవచ్చు. వీటిలో అతి ముఖ్యమైనది కెర్నెల్. ఇది సరాసరి హార్డువేరు పరికరాలతో సంభాషిస్తుంది. షెల్ మరియు ఇతర అప్లికేషన్ల ద్వారా వచ్చిన ఆదేశాల ప్రకారం ప్రాసెసర్మెమొరీహార్ద్ డిస్క్ మరియు ఇతర హార్డువేరు పరికరాలతో పని చేయిస్తుంది. మరియు వచ్చిన ఫలితాలను షెల్ మరియు ఇతర సాఫ్టువేరు గమనాలకు(processes) అందిస్తుంది. మొదట కంప్యూటరు ప్రారంభించినపుడు బూట్ గమనం కెర్నెల్ ను పర్యవేక్షక పాత్రలో మెమొరీ లోకి నింపుతుంది. తర్వాత కెర్నెలు తనంత తానే నడుస్తూ కంప్యూటర్ కి సంబంధించిన ఇతర సర్వీసులను ఒకటొకటిగా ప్రారంభిస్తుంది. ఆతర్వాత అది తెర వెనుక పాత్రకు పరిమితమౌతుంది. ఇతర అప్లికేషన్లు తట్టి అడిగినపుడు మాత్రమే అది తగిన కోరికలు తీరుస్తుంది.

 

కెర్నెలు ముఖ్యముగా మూడు భూమికలు నిర్వహిస్తుంది. అవిగమనాల నిర్వహణ(Process Management), గుర్తు నిర్వహణ(Memory Management) మరియు పరికరాల నిర్వహణ(Device Management). అధిక సమాచారం కోశం ఈ మార్గము లో చూడండి

 

లైసెన్సు విధానం

లినక్స్ కెర్నల్, దాని ఇతర విభాగాలలోని చాలా వరకూ GNU ప్రజా లైసెన్సు (GPL) ద్వారా విడుదల చేయబడినాయి. GPL ద్వారా విడుదల చేయబడిన సోర్సు కోడును ఉపయోగించుకోని అభివృద్ధిచేయబడిన ఇతర విషయములు కూడా GPL ద్వారా మాత్రమే విడుదల చేయాలని ఈ GPL లైసెన్సు నిర్దేశిస్తుంది. ఈ GPL లైసెన్సును కొన్ని సందర్బాలలో ఒకేరకంగా పంచుకొనె లైసెన్సు, కాపీ వదులు లైసెన్సు అని వ్యవహరిస్తుంటారు. 1997లో Linus Torvalds”GPL లైసెన్సు ద్వారా విడుదల చేయడం నేను చేసిన ఉత్తమమైన పని ” అని చెప్పినారు. కొన్ని ఇతర ఉప విభాగాలు ఇతర లైసెన్సులు వాడతాయి, అవి కూడా ఉచిత  సాఫ్ట్ వేర్ లాగానే ఉంటాయి. ఉదాహరణకు చాలా లైబ్రరీలు LGPL  ద్వార విడుదల చేయబడినాయి. యక్స్ విండోసు సిస్టము MIT లైసెన్సు ను వాడుతుంది.
లినక్స్ ట్రేడుమార్కు (U.S. Reg No: 1916230), Linus Torvalds రిజిస్టరు చేసినారు. ప్రస్తుతం దీని ట్రేడుమార్కు LMI, లినక్స్ మార్కు సంస్థ కలిగి ఉన్నది. ఈ సంస్థ ఉత్తర అమెరికా కాకుండా ఇతర దేశాలలో కూడా ఈ ట్రేడుమార్కు రిజిస్టరు చేయడానికి ప్రయత్నిస్తుంది.

లినక్స్ మరియు GNU/Linux

GNU/Linux డెస్క్ టాప్
లినక్స్ అనేది ఒక కెర్నలుమాత్రమే! సాధారణంగా అన్ని డిస్ట్రిబ్యూషనులూ (Redhat, Mandriva, Debian వంటివి) లినక్స్ కెర్నలుపై GNU లైబ్రరీలు, అప్లికేషనులు కలిపి ఒక సంపూర్ణ ఆపరేటింగు సిస్టముగా మలచి అందిస్తుంటాయి. ఈ GNU ప్రాజెక్టు లినక్స్ కెర్నలు కన్నా మందే పుట్టిన ఒక ఉచిత సాఫ్ట్వేరు ప్రాజెక్టు! అందుకని ఈ ఆపరేటింగు సిస్టమును “GNU/Linux ”  ఆపరేటింగు సిస్టము అని లేదా లినక్స్ ఆధారిత GNU ఆపరేటింగు సిస్టము అని పిలవాలని (అన్ని డిస్ట్రిబ్యూషన్లనూ) ఉచిత సాఫ్ట్వేరు ప్రాజెక్టు యొక్క రిచర్డు స్టాల్ మాన్ చెపుతుంటారు. కానీ Linus Torvalds మాత్రం GNU/Linux అని పిలవడం చాలా హాస్యాస్పదం అని అంటూ ఉంటారు.  అయినప్పటికీ కొన్ని డిస్ట్రిబ్యూషన్లు మాత్రం ముఖ్యంగా Debian వంటివి GNU/Linux అని పిలుస్తూ ఉంటాయి. కానీ లినక్స్ అనేదే చాలా ప్రచారంలో ఉన్నటువంటి పేరు. ఈ పేర్లపై భేధాభిప్రాయాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి మరియూ చాలా వివాదంగా ఉన్నాయి।

పంపిణీ వ్యవస్థలు

లినక్స్ సాధారణంగా వినియోగదారులకు వివిధ రకాల పంపిణీల ద్వారా వస్తుంది. ఈ పంపిణీ సంస్థలు ఒక వ్యక్తి చేసేవి, కొంతమంది ఔత్సాహికులు చేసేవి, లేదా పెద్ద పెద్ద సంస్థలు చేసేవిగా ఉన్నవి. ఈ పంపిణీలో లినక్స్, అదనపు సాఫ్ట్వేరు, అప్లికేషన్లు, మరియు సిస్టముపై ప్రతిస్టించడానికి సులభ పద్దతులతో వస్తూ ఉంటాయి. ఈ పంపిణీలు చాలా కారణాలతో సృస్టించబడుతూ ఉంటాయి, ఉదాహరణకు రకరకాల భాషల వారికోసం (తెలుగు, కన్నడ వంటివి), రకరకాల కంప్యూటరు హార్డువేరు నిర్మాణశైలిలకోసం (Intel,  Athlon వంటివి), రక రకాల స్థితిగతులకు (సాధారణ వినియోగదారుడు, నిజ సమయ సమస్యల కోసం) , Embedded  సిస్టముల కోసం, ఇంకా ఎన్నో రకాలుగా వస్తూ ఉంటాయి. ఇప్పటివరకు సుమారుగా 450పైగా లినక్స్ పంపిణీ వ్యవస్తలు కలవు. ఒక సాధారణ లినక్స్ పంపిణీయందు, లినక్స్ కెర్నల్, కొన్ని GNU సాఫ్ట్వేరు లైబ్రరీలు, ఉపకరణాలు, అప్లికేషనులు, కమాండు లైను యునిక్స్ షెల్, కంపైలర్లు, టెక్స్టు ఎడిటర్లు, శాస్త్రీయ ఉపకరణాలు మొదలగున్నవి కలిగి ఉంటాయి.

అభివృద్ధి ప్రయత్నములు

లినక్స్ అనునది ముందే చెప్పుకున్నట్లు ఔత్సాహికులు, స్వఛ్చంద సేవకులు కలిసి అభివృద్ధి చేసిన ఒక బృహత్ప్రయత్నం! ఈ ప్రయత్నం ఎంత పెద్దదో తెలుసుకోవడానికి జరిగిన ఈ రెండు ప్రయత్నాలను చూడండి:
మొదటిది Redhat Linux వారు చేసినారు. గిగా బక్ కన్నా ఎక్కువ, GNU/Linux సైజును అంచనా వేయడం,  ప్రకారం ఈ పంపిణీలో మొత్తం ముప్పై మిలియను (మూడు కోట్ల) సోర్సు కోడు లైన్లు కలవు! ఇందులో కేవలం కెర్నలు నందు మాత్రమే 2.4 మిలియను (ఇరవై నాలు లక్షల) లైనుల సోర్సు కోడు కలదు. ఈ కెర్నలు సోర్సు కోడు మొత్తం సోర్సు కోడులో ఎనిమిది శాతం. ఇంత పెద్ద సోర్సుకోడును సాధారణ కంపెనీలు అభివృద్ధి చేయాలంటే కొకొమో (constructive cost model, COCOMO) ప్రకారం అంచనా వేయగా అది మొత్తం 1.08 బిలియను డాలర్లుగా (2002 మారక విలువ ప్రకారం) వచ్చినది. అనగా అది సుమారుగా ఐదువేల కోట్ల రూపాయలకు సమానం!
అదే రెండువేల సంవత్సరంలో Debian చేసిన అంచనా ప్రకారం సుమారుగా యాబై ఐదు మిలియను సోర్సు కోడు లైన్లు, ఖర్చు 1.9(2000 సంవత్సరపు) బిలియను డాలర్లుగా వచ్చినది.
బిట్ కీపరు అనే అప్లికేషను ద్వారా ఈ లినక్స్ కెర్నల్ సోర్సుకోడును నడిపేవారు, కానీ ఆ అప్లికేషనుతో ఉన్న సమస్యల వల్ల ఇప్పుడు గిట్ అనే అప్లికేషను ద్వారా లినసు టోర్వాల్డ్సు నేరుగా నడుపుతున్నారు!

ఉపకరణాలు

వెనకటికి, లినక్స్ వాడలంటే  కంప్యూటరు జ్ఞానము చాలా కావలసివచ్చేది, కానీ ప్రస్తుతం వివిధ రకాలయిన పంపిణీ సంస్థలు వచ్చి లినక్స్ వాడుకను చాలా సులభతరము చేసినాయి. కానీ చారిత్రకంగా చూస్తే విండోసు, లేదా మాక్ వినియోగదారులకంటే లినక్స్ వినియోగదారులకు సాంకేతికపరంగా అనుభవం, జ్ఞానం ఎక్కువగా ఉంటుంది, దీనికి మరొక కారణం లినక్స్ వినియోగదారులకు సిస్టము అంతరంగ విషయాలు అందుబాటులో ఉండటము అని చెప్పవచ్చు. ఈ కారణాల వల్ల కొన్నిసార్లు లినక్స్ వినియోగదారులను హాకరు లేదా గీకు అని ముద్దుగా పిలుస్తుంటారు.
ముందే చెప్పుకున్నట్లు లినక్స్ ప్రస్తుతము ఎటువంటి కష్టమైన ఆపరేటింగు సిస్టము కాదు, వివిధ రకాలయిన పంపిణీ సంస్థలు వచ్చి లినక్స్ వాడకాన్ని బహు సులభతరము చేసినాయి, ఇది ప్రస్తుతము అన్ని రకాలయిన వినియోగదారులకు అందుబాటులో ఉన్నది. ఈ మధ్య కాలంలో సర్వరు రంగంలోనూ, వెబ్ సర్వీసు రంగంలోనూ, బొమ్మలను మార్పుల చేర్పులు చేయు రంగంలోనూ, చక్కని ప్రతిభ కనపర్చినది. ఇంకా ఎక్కువమంది వినియోగదారులు గల Desktop రంగంవైపు వేగంగా అడుగులు వేస్తుంది.

ఉపయోగించడములో సులువు మరియు మార్కెట్లో భాగము

ఒకప్పుడు లినక్స్ కంప్యూటర్ నిపుణులు మాత్రమే ఉపయోగించగలిగినా ఇప్పటి లినక్స్ డిస్ట్రిబ్యూషన్స్ గ్రాఫికల్ ఇంటర్ఫేస్‌తో, ఎన్నో క్రొత్త అప్లికేషన్స్‌తో ఉపయోగించడానికి సులువైనవిగా మారాయి. మార్కెట్లో లినక్స్ డెస్క్‌టాప్ భాగము చాలా వేగముగా పెరుగుతున్నది. మార్కెట్ రిసెర్చ్ కంపెని IDC ప్రకారము 2002లొ 25% సర్వర్లు మరియు 2.8% డెస్క్‌టాప్‌లు లినక్స్ మీద పనిచేస్తున్నాయి. Knoppix వంటి ఇతర distributions CD నుండే సరాసరి పనిచేయగలవు. ఇవి hard driveలో install చేయకుండా RAM నుండే పనిచేయగలవు. దీనిని CD నుండి boot చేసి వాడుకొనవచ్చు. hard drive కు ఎటువంటి మార్పు జరుగదు. అలాగే, tomsrtbt వంటి మరికొన్ని చిన్న distributions చాలా తక్కువ స్థలం తీసుకుంటూ hard drive కు ఎటువంటి మార్పు జరుగకుండా Floopy నుండి పనిచేయగలవు.

లినక్స్ పై ప్రోగ్రామింగు

లినక్స్ నకు చాలా కంపైలర్లు లభిస్తున్నాయి. GNU కంపైలరు కలక్షను (GCC ), చాలా పంపిణీలతో వస్తుంది. GCC C, C++, Java, మొదలగు కంప్యూటరు భాషలను కంపైలు చేయగలదు. కంపైలర్లే కాకుండా ఇంకా చాలా ఇంటిగ్రేటడ్ ఎన్విరాన్మెంటులు కూడా కలవు. వీటిలో Anjuta, Code::Blocks, CodeLite, Eclipse, Geany, ActiveState Komodo, KDevelop, Lazarus, MonoDevelop, NetBeans, Qt Creator మరియు  Omnis Studio,, మరియూ విశ్వ విఖ్యాత Vim , Emacs లు వీటిలో కొన్ని

సహాయము, మద్దతు

సాధారణంగా సాంకేతికపరమైన మద్దతు మొత్తము కూడా వివిధ ఆన్ లైను ఫోరములు, న్యూసు గ్రూపులు, మెయిలింగు లిస్టులు ద్వారా లినక్స్ వాణిజ్య పంపిణీదారులు, లినక్స్ వినియోగదారులు అందిస్తుంటారు! మామూలుగా ఈ గ్రూపులు అన్నీ కూడా లినక్స్ యూజరు గ్రూపులు అని పిలవబడే గ్రూపులుగా ఏర్పడతాయి. వీటిని సుక్ష్మంగా LUG లగ్ అని అంటారు!
 వాణిజ్య పంపిణీ సంస్థలకు మద్దతునకు డబ్బులు వసూలు చేయడం ద్వారా వ్యాపారం చేస్తుంటాయి. ముఖ్యముగా వీరు వాణిజ్య వినియోగదారుల నుండి డబ్బులు వసూలు చేస్తుంటారు.


తరువాత బాగం లో లినక్సు సప్పోర్ట్ చేస్తున్న ఫైల్ సిస్టమ్స్ గురించి, అసలు లినక్సు ఎందుకు secure ఆపరేటింగ్ సిస్టం అయిందో వివరంగా తెలుసుకుందాం.