రిజిస్ట్రీ ఎడిటర్ సలహాలు సూచనలు – 1

  • Outlook మెయిల్స్ అటాచ్ మెంట్ పరిమాణాన్ని పెంచడం
  • నోటిఫికేషన్లు డిసేబుల్ చేయాలి అంటే
  • Windows 7 పనితీరుని పెంచడం ఎలా?
  • XP Shutdown అప్సన్లలో హైబెర్నట్ ఐకాన్ చేర్చడం


Outlook మెయిల్స్ అటాచ్ మెంట్ పరిమాణాన్ని పెంచడం

Gmail, Yahoo, Hotmail  పలు ఇ-మెయిల్ సేర్విసులను  చాలామంది Outlook లో కన్ఫిగర్ చేసుకుని మెయిల్స్ ని ఆ ప్రోగ్రాం ద్వారా పంపిస్తూ రప్పించుకుంటూ ఉంటారు.  Gmail లాంటి అధిక శాతం ఇ-మెయిల్స్  సర్వీసులు 25MB  మించి ఫైల్ అటాచ్మెంట్ ని అనుమతిచక పోవడాన్ని దృష్టిలో ఉంచుకుని  Outlook ప్రోగ్రాం కూడా మనం మెయిల్స్ గరిష్టంగా 20MB మాత్రమే అటాచ్మెంట్ పరిమితి విధించ బడింది.  అంత కన్నా పెద్ద ఫైల్స్ అటాచ్ చేయాలి అంటే వార్నింగ్ వస్తుంది.  కొన్ని మెయిల్ సర్వీసు లు 50MB వరకు అటాచ్మెంట్  సైజ్ ని కూడా అనుమతిస్తున్నాయి.  అలాటి అపుడు outlook 2010   పరిమితిని పెంచు కోవాలి అంటే విండోస్ రిజిస్ట్రీ ఎడిటర్ ద్వారా కొన్ని మార్పులు చేసుకొని పరిమితిని పెంచు కోవచ్చు.
గమనిక : రిజిస్ట్రీ లో ఎపుడు అయిన మార్పులు చేయాలి అంటే ముందుగా రిజిస్ట్రీ ని బెకప్ తీసుకోవడం మంచిది.  లేకపోతె ఆపరేటింగ్ సిస్టం కరప్ట్ అయ్యే అవకాశం ఉంది.
HEKEY_CURRENT_USERSoftwareMicrosoftoffice14.0OutlookPreferences అనే విబాగం లో కుడి చేతి వైపు New>DWORD(32Bit) Option ద్వారా MaximumAttachementSize పేరుతో ఓ DWORD క్రియేట్ చేసి దాన్ని డబల్ క్లిక్ చేసి Decimal ప్రమాణంలో Kilobyte లో విలువను ఇవ్వాలి.  అంటే 30MB కి పెంచాలంటే 40×1024 లెక్కిస్తే 40960 అవుతుంది.  ఆ విలువ ని ఇవ్వాలి.
నోటిఫికేషన్లు డిసేబుల్ చేయాలి అంటే
విండోస్ Vista, windows 7 మరియు Windows 8 సిస్టం ట్రేలోతరుచుగా మనం అనేక నోటిఫికేషన్లు చూస్తూ ఉంటాం.  కొన్ని అవసరం అయినప్పటికీ అస్తమాను మిమల్ని విసుగిస్తు ఉంటె ఇకపై అవి కనపడకుండా వాటిని శాశ్వతంగా డిసేబుల్ చేయవచ్చు. దానికి రిజిస్ట్రీ ఎడిటర్ లోని కీ మారిస్తే సరిపోతుంది.
గమనిక : రిజిస్ట్రీ లో ఎపుడు అయిన మార్పులు చేయాలి అంటే ముందుగా రిజిస్ట్రీ ని బెకప్ తీసుకోవడం మంచిది.  లేకపోతె ఆపరేటింగ్ సిస్టం కరప్ట్ అయ్యే అవకాశం ఉంది.
HKEY_CURRENT_USERSoftwareMicrosoftWindowsCurrentVersionExplorerAdvanced అనే విబాగం లోకి వెళ్లి EnableBalloonTips  పేరుతో ఒక DWORD వేల్యునిసృష్టించి దానికి డిపాల్ట్ గా 0ఉంచితే సరిపోతుంది.
 
Windows 7 పనితీరుని పెంచడం ఎలా?
Window ఆపరేటింగ్ సిస్టం ఉపయోగిస్తున్న వారు చిన్న చిన్న సెట్టింగ్స్ మార్పు చేసుకుంటూ పెర్ఫార్మెన్స్ పెంచవచ్చు.  HKEY_CURRENT_USERSoftwareMicrosoftWindowsCurrentVersionPoliciesExplorer అనే విభాగం లో ఇప్పుడు చెప్పుకోబోయే పేర్లతో వేర్వేరు DWORD విలువలను కొత్తగా సృష్టించండి.
DWORD                                      VALUE
NoLowDiskSpaceChecks                 1
LinkResolveIgnoreLinkInfo                1
NoResolveSearch                          1
NoResolveTrack                            1
NoInternetOpenWith                       1
 ఈ వాల్యూస్ ఇచ్చిన తరవాత మీ కంప్యూటర్ రీస్టార్ట్ చేయండి. 
 
XP Shutdown అప్సన్లలో హైబెర్నట్ ఐకాన్ చేర్చడం.
 Windows XP shutdown మేను లో Standby, Turn off, Restart అనే అప్సన్ల కనిపిస్తూ ఉంటాయి.  కీ బోర్డు మీదా Shift కీ ప్రెస్ చేసినపుడు మాత్రమే హైబెర్నట్ కనిపిస్తుంది ఇలా కాకుండా డైరెక్ట్ గా మేను లో కనిపించాలి అంటే రిజిస్ట్రీ లో చిన్న మార్పు చేస్తే సరిపోతుంది. HKEY_LOCAL_MACHINESoftwarePoliciesMicrosoftWindowsSystem అనే విబాగం లోకి వెళ్లి మౌస్ రైట్ క్లిక్ చేసి New>Key అనే అప్సన్ ద్వారా ఒక కొత్త కీ ని సృస్టిచండి. దానికి Shutdown అనే పేరుని ఇచ్చి ఇపుడు దానిలో సబ్ కీ ShowHibernateButton పేరిట create చేయాలి.  New>DWORD అనే ఆప్షన్ ద్వారా కొత్త DWORD create చేయాలి దాని విలువ ‘1’ ఇవ్వండి.  ఇపుడు కంప్యూటర్ రీస్టార్ట్ చేయండి.  ఇకపై shutdown మేను లో Hibernate కుడా వస్తుంది.