* Restart అవసరం లేని అప్ డెట్లు వెంటనే Install.
* Aero Snap, Shake లు వద్దనుకుంటే.
* సాఫ్ట్ వేర్లు ఇన్ స్టాల్ చేసేటపుడు Option మెను ముందుకు రావట్లేదా..?
Microsoft అందిస్తున్న ఉచిత ఏంటి వైరస్ ప్రోగ్రామ్ అయిన Microsoft Security Essentials ని వాడుతున్నారు. ఇది చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని పిసి లో ఇన్ స్టాల్ చేసాక మనకు తెలియకుండానే Microsoft Security Essentials, Microsoft Defender గ్రూప్ లో మన కోసం ఓ అక్కౌంట్ సృష్టించబడి.. మన కంప్యూటర్ లో వివిధ వైరస్ లు గుర్తించబడినపుడు మనం ఎటువంటి చర్యలు తీసుకుంటూ నాము అన్న వివరాలు, ఇతర సమాచారం ఆ గ్రూప్ లోని ఇతర సభ్యులకి పరోక్షంగా అందచేయబడుతుంది. దిన్నె SpyNet మెంబర్ షిప్ అంటారు. దీన్ని వద్దనుకుంటే Registry Editor లో ఎడిట్ చేయడం వల్ల Disable చేయవచ్చు.
HEKY_LOCAL_MACHINESOFTWAREMicrosoftWindows DefenderSpyNet అనే విభాగంలోకి వెళ్లి Edit మెనులో Permission Option క్లిక్ చేసి ప్రస్తుతం వాడుతున్న యూసర్ అక్కౌంట్ ని ఎంచుకుని Full Control హక్కులు ఇవ్వండి. ఒక వేళ కనుక Permissions మార్చక పోతే ఈ చిత్రం లో చూపించబడిన Error message వస్తుంది.
ఇపుడు చివరగా ఈ క్రింద చిత్రంలో విధం గా కన్పించే “SpyNetReporting” అనే ఎంట్రీని డబుల్ క్లిక్ చేసి దానికి “0”
అనే విలువని సెట్ చేసామంటే ఇకపై మన పిసి నుండి ఏ వివరాలు పంచుకో బడవు.
Notifications ఏవి వద్దనుకుంటే
విండోస్ ఆపరేటింగ్ సిస్టం లో system tray లో వివిధ రకాల Notifications చూపిస్తూ విసుగిస్తూ ఉంటాయి. ఇకపై Notification వద్దనుకుంటే రిజిస్ట్రీ ఎడిటర్ లో ఇపుడు చెపుతున్న DWORD create చేసి ఇకపై Notification లు రాకుండా చేసుకోండి.
HKEY_CURRENT_USERSoftwareMicrosoftWindowsCurrentVersionExplorerAdvanced అనే విభాగం లోకి వెళ్లి “EnableBalloonTips” పేరుతో ఓ DWORD వేల్యూ ని సృష్టించి దాని విలువ “0” గా ఉంచితే సరిపోతుంది.
Restart అవసరం లేని అప్ డెట్లు వెంటనే Install..
Windows Update ఎప్పటికి అపుడు మైక్రోసాఫ్ట్ నుండి మన కంప్యూటర్ లోకి అనేక అప్ డేట్లు డౌన్ లోడ్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఇన్ స్టాల్ అవ్వాలి అంటే కంప్యూటర్ రీస్టార్ట్ అవ్వాలిసి వస్తుంది. కొన్నిటికి రీస్టార్ట్ అవసరం లేదు. ఏవి అయితే ఇలా రీస్టార్ట్ అవసరం లేని అప్ డేట్లు ఉంటాయో వాటిని డౌన్ లోడ్ అయిన వెంటనే ఇన్స్టాల్ చేయాలి అంటే Registry ఎడిటర్ లో ఈ చిన్న మార్పు చేస్తే చాలు.
HKEY_LOCAL_MACHINESOFTWAREPoliciesMicrosoftWindows అనే విభాగంలో WindowsUpdate అని, ఆ WindowsUpdate లో AU అని రెండు కీ లను సృష్టించి … AU లో ఉండగా కుడి చేతి వైపు AutoInstallMinorUpdates పేరుతో ఓ DWORD వాల్యుని సృష్టించి దాని విలువ “1” ఇస్తే సరిపోతుంది.
Aero Snap, Shake లు వద్దనుకుంటే..
విండోస్ 7 లో ఏదయినా విండో ని మౌస్ తో కుడి, ఎడమ చివర్లకు లాగితే అది దానంతట అదే ఆ ఎడమ, కుడివైపు స్క్రీన్ సగానికి అమర్చబడిపోతుంది. Aero Snap ఈ సదుపాయంతో పాటు, ఏదయినా విండో ఫై మౌస్ తో క్లిక్ చేసి పట్టుకుని అటు ఇటు Shake చేస్తే ఆ విండో క్రింద ఉన్న విండో లు అన్ని మినీ మైజ్ అయ్యే Aero Shake అనే సదుపాయాన్ని Disable చేసుకోవాలి అంటే Registry Editor లో ఈ చిన్న మార్పు చేయండి.
HKEY_CURRENT_USERControl PanelDesktop అనే విభాగం లో కుడి చేతి వైపు కనిపించే “WindowArrangementActive” అనే ఎంట్రీ ని డబల్ క్లిక్ చేసి దాని విలువని “0” అని ఇచ్చి కంప్యూటర్ ని రీస్టార్ట్ చేయండి.
సాఫ్ట్ వేర్లు ఇన్ స్టాల్ చేసేటపుడు Option మెను ముందుకు రావట్లేదా..?
మనం ఏదో ఒక సాఫ్ట్ వేర్ ఇన్ స్టాల్ చేయడం స్టార్ట్ చేసి మరో విండో లో మన పని మనం చేసుకుంటూ ఉంటాం. వెనుక ఇన్ స్టాల్ అవుతున్న సాఫ్ట్ వేర్ ఏదో ఒక option ని మనం ఎంచుకోవడం కోసం ఓ విండో దగ్గర ఆగి పోయి ఉంటుంది. మనం అన్ని విండోస్ లను minimize చేసుకుంటూ వెళ్లి అల మన సెలక్షన్ కోసం వేచి ఉన్న Installation ని పట్టించు కునే వరకు ముందుకు సాగదు. వాస్తవానికి ప్రతి సాఫ్ట్ వేర్ installation సమయం లో తనకు యూసర్ నుండి సమాచారం అవసరం అయితే తన ఫోకస్ ని foreground కి తెసుకు వచ్చి చూపించాలి. కొన్ని Application లు ఈ విషయంలో ఫెయిల్ అయినపుడు విండోస్ స్వయంగా 200 సెకన్లుకు ఆ విండోని ముందుకు తెసుకు వస్తుంది. ఈ సమయాన్ని తగ్గించుకోవాలి అంటే రిజిస్ట్రీలో చిన్న మార్పు చేయండి.
HKEY_CURRENT_USERControl PanelDesktop అనే విభాగం లో ForegroundLockTimeout అనే దానికి 10000 అని విలువని ఇస్తే 10 సెకన్లలోపే మనకు విండోస్ అలా బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న విండో ని పైకి తెచ్చి చూపిస్తుంది.