రిజిస్ట్రీ ఎడిటర్ సలహాలు సూచనలు – 3

* విండోస్ Update అయిన తరువాత రీస్టార్ట్ అవకుండా ఉండాలంటే.

* ContextMenu లో Open withNotepad అని ADD చేయాలంటేఎలా?
* WindowsOwner information మార్చడం ఎలా?
* My Computerలో Recycle Bin ఐకాన్పెట్టడం ఎలా..?
* రైట్క్లిక్ మెను లో Encrypt/DecryptAdd చేయడం ఎలా?

గమనిక : రిజిస్ట్రీ లో ఎపుడు అయిన మార్పులు చేయాలి అంటే ముందుగా రిజిస్ట్రీ ని బెకప్ తీసుకోవడం మంచిది. లేకపోతె ఆపరేటింగ్ సిస్టం కరప్ట్ అయ్యే అవకాశం ఉంది.
విండోస్ Update అయిన తరువాత రీస్టార్ట్ అవకుండా ఉండాలంటే.
విండోస్ Update అయిన అయిన తరువాత విండోస్ రీస్టార్ట్ చేయమంటూతరచుగా మెసేజ్ విండోస్ ఓపెన్ అవుతూ ఉంటుంది.
ఈ విండో ఇలా ఓపెన్ అయితరచుగా ఇబ్బంది పెడుతూ ఉంటే రిజిస్ట్రీఎడిటర్ లో చిన్న మార్పు చేసుకుని ఈ విండోస్ రాకుండా Disable చేయవచ్చు.
HKEY_LOCAL_MACHINESOFTWAREPoliciesMicrosoftWindowsWindowsUpdateAU
అనే విభాగం లో 32-bit DWORD కీ NoAutoRebootWithLoggedOnUsers అనే పేరుతోక్రియేట్ చేయండి. తరువాత దాని విలువ “1” గాఇవ్వండి. ఇక ముందు మీరు login అయి ఉండగా ఈమెసేజ్ ఇక రాదు.
ఒకవేళ ఈ సెట్టింగ్ వద్దనుకుంటే NoAutoRebootWithLoggedOnUsers అనే కీ డిలీట్ చేస్తేచాలు.
 
Context Menu లో Open with Notepad అని ADD చేయాలంటే ఎలా?
ఏదయినా ఫైల్ ని Notepad లో ఎడిట్ చేయాలి అంటే Manual గా Notepad ఓపెన్ చేసి ఫైల్దానినుండి ఓపెన్ చేయాలి.
అలా కాకుండా ఫైల్ మీద రైట్ క్లిక్ చేసి అక్కడ Open with Notepad ద్వారా ఓపెన్చేయవచ్చు. దాని కోసం రిజిస్ట్రీ లో ఈమార్పులు చేస్తే సులభం గా Add చేయవచ్చు.
HKEY_CLASSES_ROOT*shell అనే విభాగం లో “Open with Notepad” అనే పేరుతో ఒకకీ Create చేయండి తరువాతదానిలో “command” అనే మరొక కీ Create చేయండి. ఎప్పుడు కుడి చేతి వైపు ఉన్న “Default” విలువని “notepad.exe %1” గా మార్చండి.
 
Windows Owner information మార్చడం ఎలా?
విండోస్ ఇన్ స్టాల్ చేసేటపుడు Owner Information ఇవ్వడం జరుగుతుంది. తరువాత కాలంలో దానిని మార్చుకోవాలి అంటే రిజిస్ట్రీ ఎడిటర్ లో మార్పు చేసుకోవచ్చు.
HKEY_LOCAL_MACHINESOFTWAREMicrosoftWindowsNTCurrentVersion అనే విభాగం లో కుడి చేతి వైపు “RegisteredOwner” అనే DWORD మీద డబల్ క్లిక్చేసి మీకు కావలిసిన పేరు ఇవ్వండి. ఎపుడు run> winver.exeఎంటర్ చేసి మీరు ఇచ్చిన మార్పు జరిగింది ఏమో నిర్ధారించుకోండి.
 
My Computer లో Recycle Bin ఐకాన్ పెట్టడంఎలా..?
My Computer ఓపెన్ చేసినపుడుమన డ్రైవ్ లతో పాటు Recycle Bin కూడా కనిపించాలిఅంటే రిజిస్ట్రీ లో ఈ చిన్న మార్పు ని చేయండి.
HKEY_LOCAL_MACHINESOFTWAREMicrosoftWindowsCurrentVersionExplorerMyComputerNameSpace అనే విభాగం లో Namespace మీద రైట్ క్లిక్చేసి ఈ చిత్రం లో కనిపించిన విదంగా ఒక
కొత్త కీ ని “{645FF040-5081-101B-9F08-00AA002F954E}“ సృష్టించండి
ఇపుడు మీరు కోరుకున్న విధంగా “Recycle Bin” ఐకాన్ My Computer లోపెట్టబడుతుంది.
 
రైట్ క్లిక్ మెను లో Encrypt/Decrypt Add చేయడం ఎలా?
విండోస్ 7 లో Encryption అనే Feature ఉపయోగించాలి అనుకున్నపుడుపెద్దగా కష్ట పడకుండా రైట్ మెను లో Add చేయాలి అంటే రిజిస్ట్రీ ఎడిటర్ లో ఈ మార్పులు చేయండి.
HKEY_CURRENT_USERSoftwareMicrosoftWindowsCurrentVersionExplorerAdvanced అనే విభాగం లోకి వెళ్ళిన తరువాత కుడి చేతి వైపు రైట్ క్లిక్ చేసి ఒక కొత్త “32bit DWORD” ని “EncryptionContextMenu “ అనే పేరుతో సృష్టించండి. దానివిలువ “1” గా ఇవ్వండి.
Allow Blog Feeds