భీమ్ యాప్ గురించి పూర్తి సమాచారం

డిజిటల్ లావాదేవీలను సులభతరం చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ భీమ్ యాప్ ని లాంచ్ ఆవిష్కరించిన విషయం అందరికీ విదితమే. ఈ బ్రాండ్ యాప్ ఆవిష్కరణ సంధర్భంగా ప్రధాని మోడీ ఇది అద్భుతాలు సృష్టిస్తుందని బీఆర్ అంబేద్కర్‌కు నివాళిగా ఈ యాప్‌ను తీసుకొచ్చామని తెలిపారు. ఈ యాప్ అసలు పేరు భారత్ ఇంటర్‌ఫేస్ ఫర్ మనీ. దీన్ని అన్ని రకాల ఫోన్లలో ఉపయోగించుకోవచ్చు.

ఇంటర్నెట్ అవసరం లేదు ఈ యాప్‌కు ఇంటర్నెట్ అవసరం లేదు. కస్టమర్లు ఎలాంటి డెబిట్, క్రెడిట్ కార్డులు అవసరం లేకుండానే భీమ్ యాప్ ద్వారా డిజిటల్ లావాదేవీలన్ని పూర్తిచేసుకోవచ్చు. అంటే కేవలం చేతివేళ్లతోనే పని పూర్తి చేయవచ్చు.

మొబైల్ నెంబర్ ద్వారా కేవలం మొబైల్ నెంబర్ ద్వారా బ్యాంకు అకౌంట్ నుంచి నగదును బదిలీ చేసుకునే లేదా సులభతరంగా పేమెంట్లు కూడా చేసుకునే అవకాశం ఈ యాప్ కల్పిస్తుంది.

యాప్ ఓపెన్ చేసి సెండ్ మనీ కొడితే ఈ యాప్ ద్వారా ఎవరైనా యాప్ ఓపెన్ చేసి సెండ్ మనీ కొడితే అప్పుడు చెల్లింపు చేయాల్సిన మొత్తం అలాగే ఫోన్ నంబర్ లాంటి వివరాలు అడుగుతుంది. వాటిని టైప్ చేసే చెల్లింపులు జరిగిపోతాయి.

క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసుకునే అవకాశం కస్టమర్లకు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసుకునే అవకాశం కూడా ఈ యాప్ కల్పిస్తుంది. వ్యాపారి కూడా క్యూఆర్ కోడ్‌ను భీమ్ యాప్ ద్వారా జనరేట్ చేసుకోవచ్చు. మర్చంట్‌కి నగదు చెల్లించాలనప్పుడు స్కాన్ ను ట్యాప్ చేసి, యాప్‌లో పే బటన్‌ను నొక్కాలి. తర్వాత క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు.

స్మార్ట్ ఫోన్ అవసరం లేకుండానే స్మార్ట్ ఫోన్ అవసరం లేకుండానే ఈ యాప్‌ను వాడుకోవచ్చు. పేమెంట్ల కోసం భీమ్ యాప్ వాడటానికి ఏ విధమైన మొబైల్ నుంచైనా * 99 # ను డయల్ చేయాల్సి ఉంటుంది. అనంతరం నగదు పంపడానికి, బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి, లావాదేవీల హిస్టరీ కోసం వివిధ నెంబర్లు మనకు వాటిలో దర్శనమిస్తాయి.

రూ .10 వేల వరకు లావాదేవీలు ఈ యాప్‌తో రూ .10 వేల వరకు లావాదేవీలు చేసుకోవచ్చు. రోజుకు రూ .20,000 వరకు లావాదేవీలను భీమ్‌తో ముగించుకోవచ్చు. భీమ్ యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ వెర్షన్‌లో అందుబాటులో ఉంది. ఐఓఎస్‌లకి త్వరలో అందుబాటులోకి రానుంది.

డెబిట్ కార్డు మాదిరి కస్టమర్ల ఫోన్‌కు మొబైల్ వాలెట్ యాప్ ద్వారా అయితే మొదట దానిలో నగదు నింపి, తర్వాత వాడుకోవాలి. కానీ ఈ యాప్‌లో నగదు నింపాల్సినవసరం లేదు. భీమ్ యాప్ అచ్చం డెబిట్ కార్డు మాదిరి కస్టమర్ల ఫోన్‌కు డైరెక్ట్‌గా బ్యాంకు అకౌంట్ లింక్ అయి ఉంటుంది. కాబట్టి పేమెంట్లు వెనువెంటనే జరిపోతాయి. దీనిపై వ్యాపారులు ఎలాంటి ఆందోళనలు చెందాల్సినవసరం ఉండదు.

యూపీఐతో సంబంధం లేని బ్యాంకులు యస్‌బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌ సీ వంటి దిగ్గజ బ్యాంకులతో పాటు అన్ని యూపీఐ కనెక్ట్ బ్యాంకులన్నీ భీమ్‌ను అంగీకరిస్తాయి. యూపీఐతో సంబంధం లేని బ్యాంకులు కూడా ఐఎఫ్‌ఎస్‌సీ నెంబర్‌తో భీమ్ ద్వారా నగదు పొందుతాయి.