గూగుల్ క్రోమ్‌ను బ్రౌజర్‌గా వినియోగిస్తున్నారా? అయితే క్రోమ్ ఎక్స్‌టెన్షన్లపై ఒక్కసారి దృష్టి సారించండి. ఇవి మీ ప్రతిపనిలోనూ ఉపయోగపడతాయి. ఈ టూల్స్‌ను ఎంచుకుంటే బ్రౌజింగ్ మరింత సులువవుతుంది.
పనులన్నీ పెండింగ్‌లో ఉండిపోతున్నాయా? సమయానికి పూర్తి చేసి తీరాల్సిన పనులను మరచిపోతున్నారా?
అయితే డూ ఇట్(టుమారో) అప్లికేషన్‌ను ఎంచుకోండి. సింపుల్ టాస్క్స్ అన్నింటిని రిమైండర్ బుక్‌లో యాడ్ చేసుకోవచ్చు. మరుసటి రోజు చేయాల్సిన పనులు కుడి వైపు ఉండే పేజీలో కనిపిస్తాయి. మరుసటి రోజు చేయాల్సిన పనులను యాడ్ చేసుకునే సమయంలో ఆరో మార్క్‌ను టుమారో పైకి పుష్ చేయాలి. ఒకవేళ మరుసటి రోజు ఆ పని పూర్తి చేయలేకపోతే మళ్లీ ఆరో మార్క్‌ను టుమారో పైకి పుష్ చేయాల్సి ఉంటుంది. పూర్తి చేసి తీరాల్సిన పని మరచిపోకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది.
ఒక్క క్లిక్ చాలు
గూగుల్ క్రోమ్ నుంచే మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లో వచ్చిన నోటిఫికేషన్స్‌ను చూడవచ్చు. ఫేస్‌బుక్ ఎక్స్‌టెన్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా స్నేహితులతో నిరంతరం ఇంటరాక్ట్ కావచ్చు. ఒక్క క్లిక్‌తో కామెంట్స్ పోస్ట్ చేయవచ్చు. షేర్ చేసుకోవచ్చు. మల్టిపుల్ ఈ మెయిల్స్ అకౌంట్స్‌ని మేనేజ్ చేయాలంటే గూగుల్ క్రోమ్ ఉండాల్సిందే. ఇందులో వాయిస్ నోటిఫికేషన్స్‌ను సెట్ చేసుకోవచ్చు. అంటే సినిమా చూస్తూ లేదా వంట చేస్తూ బిజీగా ఉన్న సమయంలో ఈమెయిల్ వచ్చినట్లయితే మెయిల్ సారాంశాన్ని వినిపిస్తుంది. గూగుల్ క్రోమ్ క్లోజ్ చేసి
ఉన్నా న్యూ ఈమెయిల్స్ వచ్చినట్లయితే అలర్ట్ పొందే సౌలభ్యం ఉంది. పెద్ద సైజు ఫోటోలు అటాచ్ చేసి ఉన్న ఈమెయిల్స్‌కు జూమ్ ఇన్, జూమ్ అవుట్ ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు. వాయిస్ నోటిఫికేషన్స్‌కు మీకు నచ్చిన పాటను లేదా డైలాగ్‌ను జతచేసుకోవచ్చు. డెస్క్‌టాప్‌పై ఫుల్‌స్క్రీన్‌లో క్లాక్ కావాలంటే టూల్‌బార్ క్లాక్ ఎక్స్‌టెన్షన్‌ను ఎంచుకోవాలి. ఇందులో క్లాక్ డిజిట్స్‌కు 65 రకాల రంగులను ఎంచుకోవచ్చు. నచ్చిన థీమ్‌ను పెట్టుకోవచ్చు. సెట్టింగ్స్ అన్నీ అటోసేవ్ అవుతాయి.
క్లిక్ అండ్ క్లీన్
టైప్ చేసిన యూఆర్ఎల్స్, కుకీస్, డౌన్‌లోడ్ హిస్టరీ, బ్రౌజింగ్ హిస్టరీ…ఇలా అన్ని పనులను ఒక్క క్లిక్‌తో పూర్తి చేయవచ్చు. ఇందుకోసం క్లిక్ అండ్ క్లీన్ బటన్ ఎక్స్‌టెన్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. ఇది మీ పర్సనల్ కంప్యూటర్‌లో ఉన్న మాల్‌వేర్‌ను స్కాన్ చేస్తుంది. బ్రౌజింగ్ హిస్టరీని డిలీట్ చేస్తుంది. డౌన్‌లోడ్ హిస్టరీని తొలగిస్తుంది. టెంపరరీ ఫైల్స్‌ను తొలగిస్తుంది. హార్డ్‌డ్రైవ్‌ను క్లీనప్ చేయడం ద్వారా ఇంకా ఎక్కువ డిస్క్ స్పేస్‌ను పొందవచ్చు. ఇంటర్నెట్‌కు కనెక్ట్ కానవసరం లేకుండానే ఫ్లాష్ వీడియోస్‌ను చూడవచ్చు.
గుర్తు చేసే టూల్
12 గంటలకల్లా పని పూర్తికావాలి. 2 గంటల వరకు చదువుకోవాలి. 6 గంటలకు ప్రైవేట్ క్లాస్‌కు వెళ్లాలి. ఇలా… పని ఏదైనా సమయానుగుణంగా పూర్తి కావాలంటే టాస్క్ టైమర్ టూల్ ఉండాల్సిందే. దీని సహాయంతో చేయాల్సిన పనులకు టైమ్‌గోల్ సెట్ చేసుకోవచ్చు. ప్రతీ పనికి ఎంత సమయం కేటాయిస్తున్నారనే విషయాన్ని పరిశీలించవచ్చు. పూర్తి చేయాల్సిన పనులకు టాస్క్ సేమ్, కేటాయిస్తున్న సమయం, గోల్ టైమ్ లాంటివి పొందుపరచవచ్చు. డెస్క్‌టాప్ నోటిఫికేషన్స్, వాయిస్ నోటిఫికేషన్స్ పొందవచ్చు. ఈ ఫీచర్స్ బ్రౌజింగ్‌ను మరింత సులభతరం చేస్తాయనడంలో సందేహం లేదు కదూ.