ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ లో ప్రతీ పదం లోను అర్ధం ఉంటుంది. కాని అర్ధం చేసుకోవడం మాత్రం కాస్త కష్టంగానే ఉంటుంది. మేఘాలు (క్లౌడ్) ఎలా ఒక చోట ఉండి ఎక్కువ బాగంలో వర్షం పడేలా చేస్తాయో అదే విధంగా క్లౌడ్ కంప్యూటింగ్ లో ఒక చోట సేవలు ఉంటాయి.
అక్కడి నుంచే ఈ సేవలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కష్టమర్స్ కు అందుతూ ఉంటాయి. ఇటివాలా కాలంలో ఈ కాన్సెప్ట్ పైన రిసెర్చ్ చేస్తున్నాయి. కొన్ని సంస్థ లు ఇప్పటికె క్లౌడ్ కంప్యూటింగ్ సేవలను అందిచడానికి సిద్దమవతున్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్ కు సంబదించిన పలు ఆసక్తికరమయిన అంశాలను తెలుసుకుందాం.
క్లౌడ్ కంప్యూటింగ్ ఎలా పనిచేస్తుంది…:
గత కొన్ని సంవత్సరాలుగా ఈ కాన్సెప్ట్ బాగా వాడుకలోకి వస్తుంది. ఇందులో ముఖ్యమయిన డేటా, అప్లికేషన్స్ సంస్థలు ఏర్పాటు చేసిన వెబ్ సర్వర్ లో ఉంటాయి. సూక్సమంగా క్లౌడ్ కంప్యూటింగ్ గురుంచి చెప్పాలి అంటే ఒక సంస్థ ఒక చోట అనేక వెబ్ సర్వర్ ఏర్పాటు చేస్తుంది. వీటిలో క్లైంట్సుకు కావలిసిన అన్ని రకాలు అప్లికేషన్స్ యాక్సెస్ చేయడం, తన డేటా ఉంచడం చేస్తాడు. అంటే క్లైంట్ కంప్యూటర్లో ఎటువంటి డేటా, అప్లికేషన్స్ ఉండవు. కేవలం డివైస్ ఆపరేటింగ్ సిస్టం మాత్రమే ఉంటుంది, లేదా క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసును అందించే సంస్థ అందించిన అప్లికేషను మాత్రమే ఉంటుంది. క్లైంట్ నేరుగా క్లౌడ్ సర్వర్స్ నుంచి కావలిసిన అప్లికేషన్స్ను, డేటాను ఎక్సెస్ చేస్తూ ఉంటాడు. ఈ మొత్తం ప్రాసెస్ నే క్లౌడ్ కంప్యూటింగ్ అని పిలుస్తారు. దీని వలన క్లైంట్ వివిధ సాఫ్ట్ వేర్ అప్లికేషన్స్ పై ఎటువంటి ఖర్చు చేయలిసిన అవసరం లేదు. కేవలం డివైస్ ఉంటె సరిపోతుంది. డేటా ను, అప్లికేషన్స్ ను ఎక్కడినున్చయిన ఎప్పుడు అయిన యాక్సాస్చేసుకునే వీలుంది. అంతే కాదు మీ డేటా సర్వేర్ లో సురక్షితంగా ఉంటుంది. పైగా క్లైంట్స్ కు పనికూడా తేలిక అవతుంది. సాఫ్ట్ వేర్ క్రాష్, డేటా లాస్ కావడం వంటివి ఉండవు, పైగా సిస్టం కూడా వేగంగా పని చేసే అవకాశం ఉంది. క్లౌడ్ కంప్యూటింగ్ రెండు సెక్షన్ ఉంటాయి. ఒకటి ఫ్రంట్ ఎండ్ అయితే రెండవది బ్యాక్ ఎండ్. ఈ రెండు నెట్వర్క్ (ఇంటర్నెట్) ద్వారా ఒకదాని ఒకటి కనెక్ట్ అవుతాయి. ఫ్రంట్ ఎండ్ వచ్చేసి సర్వీసును పొందే క్లైంట్ డివైస్. (ఇక్కడ డివైస్ అంటే లాప్ టాప్, పిసి, టాబ్లెట్ పిసి… ఇలా ఏదయినా కావచ్చు.) బ్యాక్ ఎండ్ అంటే సర్వీసును అందిస్తున్న క్లౌడ్ సర్వర్ (వెబ్ సర్వర్లు), వీటిని సర్వీసును అందించే సంస్థ ఏర్పాటు చేస్తుంది. క్లైంట్ వైపు ఆఫీసు లో ఉండే కంప్యుటర్ నెట్వర్క్ లేదా కంప్యుటర్ ఉంటుంది. ఈ రెండింటి మద్య ఇంటర్నెట్ ద్వారా. ఏర్పాటు చేసే ఒక వ్యవస్థ ద్వారా క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు విస్తరిస్తూ ఉంటాయి. ఒక సంస్థ కంప్యూటర్స్ ను ఏర్పాటు చేసుకుని, విలువయిన సాఫ్ట్ వేర్స్ని తీసుకోకుండానే క్లౌడ్ కంప్యూటింగ్ ని అందించే సంస్థల ద్వారా నేరుగా కావలిసిన అప్లికేషన్స్ పొంద వచ్చు. ఇలా ఎన్ని కంప్యూటర్స్ ను అయిన సెట్ చేసుకోవచ్చు. అంతే కాకుండా మీ సిస్టం లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం వెబ్ సర్వర్ లోనే డేటా అప్లికేషన్స్ ఉంటాయి.
క్లౌడ్ కంప్యూటింగ్ అప్లికేషన్స్:
క్లౌడ్ కంప్యూటింగ్ కు లిమిట్ అంటూ ఏమి ఉండదు. ఎటువంటి సర్వీసు నైన అందిస్తుంది. చిన్న వర్డ్ ప్రోసుస్సోర్ అప్లికేషను మొదలు కొని, ఒక సంస్థ సంబదించిన కస్టమైజే సాఫ్ట్ వేర్ వరకు ఎటువంటి సాఫ్ట్ వేర్ అయినా క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా సులువగా అందించే వీలు ఉంది. మన వద్ద ఉండే సాదారణ సిస్టం లోని అయిన క్లౌడ్ సర్వర్ నుంచి ఎక్సెస్ చేసే ఎటువంటి సాఫ్ట్ వేర్అయిన రన్ చేయగలం. ఇంటర్నెట్ మాదిరిగా ఈ సర్వర్లు ఎప్పటికి అందుబాటులో ఉంటాయి. పైగా ఎక్కడినుండి అయిన ఎక్సెస్ చేసుకునే వీలుఉంటుంది. క్లౌడ్ కంప్యూటింగ్ వలన ఒక సంస్థ ఉద్యోగి తనకు కావలిసిన డేటా ను ఎక్కడినుండి అయిన ఎక్సెస్ చేయవచ్చు. అయితే యాక్సెస్ చేయలిసి పద్దతి ఆయనకు తెలిసే ఉంటుంది. ఉదాహరణకు యూసర్ ఐడి, పాస్ వర్డ్ వంటివి.
ఇక్కడికి వచ్చే సమస్య ఉద్యోగి ఏదేని డేటా ను వేరే చోట నుండి యాక్సెస్ చేసి దుర్వినియోగం చేసే వీలు ఉంది. కావున సంస్థ లో ఒక్కో ఉద్యోగి తాను ఎంతవరకు యాక్సెస్ చేయవచ్చో అంత వరకే లిమిట్ ఉంటుంది. ఐటి ఉపోయోగిస్తున్న ప్రతీ చోట కూడాఈ క్లౌడ్ కంప్యూటింగ్ ఇంప్లిమెంట్ చేయవచ్చు.
క్లౌడ్ కంప్యూటింగ్ వలన ఉన్న మరో ఉపయోగం వచ్చేసి, క్లైంట్ వైపు నుంచి ఖరీదైన హార్డువేర్ కలిగి ఉండలిసిన అవసరం లేదు. నార్మల్ కంప్యూటర్ నుంచి కూడా నేరుగా క్లౌడ్ సేవలను యాక్సెస్ చేయవచ్చు. కంప్యూటర్ వేగంగా పని చేయడానికి ఎక్కువ మోమేరి అవసరం లేదు. ఎందుకు అంటే డేటా, అప్లికేషన్స్ నిర్వహణ మొత్తం క్లౌడ్ సర్వర్ లోనే ఉంటుంది. క్లైంట్ వైపు ఏర్పాటు చేసుకునే కంప్యూటర్ నుండి యాక్సెస్ మాత్రమే జరుగుతుంది. తను చేసే ప్రతీ పనిని తిరిగి సర్వర్ లోనే స్టోర్ చేయబడుతుంది. కావలిసిన డేటా ని బ్యాక్ అప్ తెసుకోవడం… వంటివి చేయవచ్చు. ఫ్రంట్ ఎండ్ (క్లైంట్ కంప్యూటర్) లో పెద్ద మొత్తం స్పేస్ ఉండలిసిన అవసరం లేదు. మొత్తం ప్రాసెస్ సర్వర్ లోనే జరుగుతూ ఉంటుంది. ప్రతీ సంస్థ కూడా ఇటువంటి సర్వీసును ఉపయోగించడానికి ఇష్టపడతాడు. అయితే ఇందులో కూడా కొన్ని సమస్యలు లేకపోలేదు.
సమస్యలు కూడా ఉన్నాయి..:
క్లౌడ్ కంప్యూటింగ్ ను అందించే సంస్థలకు వివిధ క్లైంట్ డేటా చాల జాగర్తగా కాపాడుకుంటూ ఉండాలి. సర్వీసును పూర్తి స్థాయి భద్రతతో అందిచాలి. ముఖ్యముగా హకెర్స్ నుంచి విపరీత మయిన ఇబ్బందులు వచ్చే వీలు ఉంటుంది. వివిధ క్లైంట్ యొక్క యుసేర్ నేమ్, పాస్ వర్డ్ .. వంటి కీలక డేటా ను తెలుసుకోవడం ద్వారా నేరుగా వెబ్ సేర్వేర్స్ ఫై దాడి చేసే వీలు ఉంది. ఇక్కడ యుసేర్ సిస్టం నుండి ఎటువంటి డేటా ను దొంగాలించలేరు. అయితే క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థలు సంస్థలు తమ సర్వర్ లకు పూర్తి స్థాయి భద్రతను ఏర్పాటు చేసుకోవాలి. అదే విదంగా క్లైంట్ కూడా సంస్థపై నమ్మకం కలిగేలా ఉండాలి. అప్పుడే క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు మరింతగా విస్తరిస్తాయి. మైక్రోసాఫ్ట్, ఐబిమ్… వంటి పలు పెద్ద సంస్థలు క్లౌడ్ కంప్యూటింగ్ ను అందించే ప్రయత్నంలో ఉన్నాయి. సెక్యూరిటీ & ప్రవైసి అనేది చాలా కట్టు దిట్టంగా ఉండాలి. లేదంటే అనేక మంది డేటా ఒక్క సారే హకెర్స్ బారిన పడితే తీవ్ర పరిణామాలు జరిగే విఎలు ఉంది.
క్లౌడ్ కంప్యూటింగ్ అథేటితికేషణ్, అతరైజెశన్ అనేది పగడ్బందీగా జరగాలి లేని పక్షం లో సులువుగా హకెర్స్ ప్రవేశిస్తారు. క్లైంట్ నిత్యం సర్వర్ నుంచీ డేటా అప్లికేషను యాక్సెస్ చేస్తూ ఉంటాడు. క్లైంట్ సిస్టం ద్వారా ముక్యమయిన సమాచారాన్ని (యుసేర్ ఐడి, పాస్ వర్డ్ .. వంటి లాగిన్ సమాచారం) రాబట్టే వీలు ఉంది. కావున క్లైంట్ కంప్యూటర్ కూడా సురక్షితగా ఉండేలా క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థలు జాగర్తలు తీసుకోవాలి. భవిష్యత్తులో క్లౌడ్ కంప్యూటింగ్ విస్తరించనుంది. అనేక సంస్థలు కూడా నమ్మకమయిన సంస్థ నుండి ఈ సేవలు పొందడానికి రెడిగా ఉన్నాయి. ఎందుకు అంటే చాలా వరకు కంప్యూటింగ్ రిస్క్ తగ్గుతుంది. కీలకమయిన డేటా ఒకే చోట ఉంటుంది. మీ డేటా కూడా నేరుగా మీ కంప్యుటర్ ద్వారానే సెక్యురిటీ ప్రొవైడ్ చేసుకోవచ్చు. క్లౌడ్ సేవలు గురించి పలు ఇండియన్ కంపనీలు కుడా ఆసక్తిని చూపుతున్నాయి. క్లౌడ్ సేవలు సేవలు ఇంకా పూర్తి స్తాయిలో ఇంప్లిమెంట్ కావడం లేదు. మరింత సమయం పట్టవచ్చు.