కంప్యూటర్ బూటింగ్ స్పీడ్ ఎలా పెంచుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఈ క్రింద సూచించిన మూడు పద్దతులను క్రమం తప్పకుండా మీరు పాటించ గలిగితే కనుక బూట్ స్పీడ్ అనే సమస్యను చాలా సులభంగా అధిగమించవచ్చు.
1. అవసరం లేని సాఫ్ట్ వేర్ లు అన్ని రిమూవ్ చేయండి:
మనం తెలుసో తెలియకో అవసరాన్ని బట్టి చాలా టూల్స్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం, తరువాత ఏమి చేసాం అనేది మనం మర్చి పోతూ ఉంటాం. మనం మర్చి పోయిన కంప్యూటర్ దానిలో దాచి పెట్టుకుంటుంది దాని వల్ల హార్డ్ డిస్క్ లో స్పేసు నిండి పోవడమే కాక, కంప్యూటర్ యొక్క స్పీడ్ తగ్గించడం, దానికి సంబందించిన DLL ఫైల్స్ స్టార్ట్ అప్ లో కంప్యూటర్ తో పాటు స్టార్ట్ అవుతాయి. దాని వాళ్ళ కంప్యూటర్ వేగం తగ్గుతుంది.
దీనికి గాను కంప్యూటర్ లో అవసరం లేని ప్రోగ్రామ్స్ అన్ని Uninstall చేయండి.
2. Hardware పార్ట్స్ ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోండి:
మనకు తెలియకుండానే మనం కంప్యూటర్ లోపల చాలా దుమ్ము పేరుకు పోతుంది. దాని వల్ల హార్డ్ డిస్క్ RPM మీద అలాగే ప్రాసెసర్ ఫ్యాన్ సరిగా తిరగక పోవడం వాళ్ళ కంప్యూటర్ తొందరగా హీట్ అయిపోతుంది.
కాబట్టి కంప్యూటర్ తరుచుగా క్లీన్ చేస్తూ ఉండండి.
3. హార్డ్ డిస్క్ క్లీన్ చేయడం:
మనం తరచుగా ఇన్స్టాల్ చేసే టూల్స్ వాళ్ళ అది Uninstall చేసిన కాని దాని తాలూకు ఫైల్స్ ఇంకా హార్డ్ డిస్క్ ఉండిపోతాయి. కాబట్టి ఏదయినా క్లీనర్ ని ఉపయోగించి కంప్యూటర్ ని తరుచుగా క్లీన్ చేస్తూ ఉండండి. దాని వాళ్ళ Temporary ఫైల్స్, ఇంటర్నెట్ cache, రిజిస్ట్రి ఏదయినా చిన్న చిన్న ఇబ్బంది ఉన్న ఒక్క చిన్న క్లిక్ తో చాలా సులభం గా క్లీన్ చేసుకోవచ్చు. CCleaner, System Mechanic లాంటి టూల్స్ ఉపయోగించండి.
చివరిగా మీకు చెప్పేది ఒక్కటే కంప్యూటర్ అనేది తరుచుగా క్లీన్ చేస్తూ ఉండాలి.