Malicious Software (Virus, Trojons, Worms, Malware) ఎవయినప్పటికి మన ప్రధాన లక్ష్యం ఒక్కటే వీటి నుండి మన సిస్టం ని కాపాడుకోవడం. దీని కోసం కంపెనీలు ప్రత్యేకమయిన బడ్జెట్ కేటాయిస్తున్నాయి అంటే ఆచ్చర్యపోవలిసిన అవసరం లేదు.
కంపెనీలు అయితే వాటి కోసం ఎంతయినా ఖర్చు పెడతాయి కాని సామాన్య వినియోగదారులు మాట ఏమిటి, వీటి కోసం Enterprise tools మాత్రమే కాకుండా సామాన్య వినియోగాధరులుకి అందుబాటులో ఉండే ఉచిత టూల్స్ కుడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ టూల్స్ కోసమే చర్చించుకుంటున్నము ఏయే టూల్ ఎలా పని చేస్తున్నది ఒక్కొక్కటిగా తెలుసుకుందాం.
Combofixఇన్ స్టాల్ చేసేముందు అసలు ఈ టూల్ ఏమి చేయగలుగుతుందో అని తెలుసుకుందాము. ఇది అత్యంత శక్తివంతమైన సాఫ్ట్ వేర్ మాత్రమే కాక ఇది ఉచితంగా లభిస్తుంది కుడా. ఇది రన్ చేసేనపుడు Malware, rootkits, Trojons, worms మరియు virus క్లీన్ చేయగలుగుతుంది, కాని ఒక ముఖ్యమయిన విషయం ఏమిటంటే వేరే Antivirus ఏదయినా మీ సిస్టం లో రన్ అవుతుఉంటే కనుక ఇది పని చేయదు Antivirus తాత్కాలికంగా disable చేసి ఈ టూల్ రన్ చేయండి. తరువాత మీ Antivirus తిరిగి Enable చేసుకోవచ్చు, మరొక ముఖ్యమయిన విషయం ఏమిటి అంటే ఈ టూల్ మరింత సమర్ధవంతంగా పని చేయాలి అంటే Safemodeలో రన్ చేయండి.
ఉచితంగా లభించే మరొక సమర్ధవంతమయిన టూల్. CCleaner రెండు విషయాలలో చాల బాగా పని చేస్తుంది 1. Windows Registry cleaning, 2.Cached Web Data, మనకి చాల టూల్స్ registry cleaning చేయడానికి ఉన్నాయి, కాని CCleanerచాల సమర్ధవంతమయిందే కాక చాలా శక్తివంతమయిన టూల్. కాని Registry Cleaning ఎప్పుడు చేసిన దానిని Backup తీసుకోవడం మర్చిపోవద్దు, CCleanerలో అంతర్గతంగా Backup తీసుకునే సౌలభ్యం ఉంది.
ఎన్నో Antivirus టూల్స్ ఉపయోగించిన తరువాత వాటికీ దగ్గరగా లేదా వాటి కంటే సమర్ధవంతంగా పని చేస్తుంది అదీ ఉచితంగా లభిస్తుంది. ఇది Antivirus టూల్ మాత్రమే కాక infection నుండి కూడా మీ సిస్టం ని కాపాడుతుంది.
Anti-Spyware మరియు Antivirus రెంటిని క్లీన్ చేసే టూల్ చాల తక్కువగా ఉన్నాయి, Malware bytes ఈ రెంటిని చాలా సమర్ధవతంగా పనిచేస్తుంది.Malware bytes ఉచితంగా మరియు పెయిడ్ రెండు వెర్షన్ లు లభిస్తుంది.ఉచితంగా వెర్షన్ లో కొన్ని పరిమితులకి లోబడి పనిచేస్తుంది, రెంటి మద్య తేడ ఒక్కటే పెయిడ్ వెర్షన్ Rea-time Scanner కలిగి ఉంటుంది, ఉచితంగా వెర్షన్ Manual గా రన్ చేయలిసి ఉంటుంది.
ఇలా మనకి అనేక టూల్స్ అందుబాటులో ఉన్నాయి, కాని సమర్దవంతమయిన టూల్ ని సెలెక్ట్ చేసుకుని వాటిని ఉపయోగిచుకోవడం బట్టి సిస్టం యొక్క Security ఆధారపడి ఉంటుంది.